హిందీ 'ఈగ' కి అజయ్ దేవగన్ నే ఎందుకు?

By Srikanya

ముంబై: రాజమౌళి తాజా చిత్రం 'ఈగ' హిందీలోకి 'మఖ్ఖీ' పేరున డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ''నాన్నా.. కథ చెప్పవూ..'' అనే సంభాషణతో సినిమా మొదలవుతుంది. ఆ నాన్న గొంతు దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళిదే. అక్కడ కూడా ప్రారంభ సన్నివేశంలో తండ్రీ కూతుళ్ల సంభాషణ వినిపిస్తుంది. అయితే ఈసారి కథను బాలీవుడ్‌ హీరో అజయ్‌దేవగణ్‌తో చెప్పించారు. ఈ విషయమై బాలీవుడ్ లో రకరకాల కథనాలు వస్తున్నాయి. త్వరలో రాజమౌళి దర్శకత్వంలో అజయ్ దేవగన్ చేయనున్నారని ఆ వార్తలు సారాంశం.

అయితే అలాంటిదేమీ లేదని,కేవలం మర్యాదరామన్న రీమేక్ సన్ ఆఫ్ సర్దార్ లో చేస్తున్న అజయ్ దేవగన్ ఆ అభిమానంతోనే ఈ సినిమాకు చెప్పాడని అంటున్నారు. సినిమాలో ప్రేక్షకులు త్వరగా లీనం కావాలంటే బాగా పరిచయం ఉన్న గొంతు వినిపిస్తేనే బాగుంటుందని రాజమౌళి భావించారని యూనిట్ వర్గాలు అంటున్నాయి. అందుకే కొన్ని పేర్లు పరిశీలించిన మీదట అజయ్‌ దేవగణ్‌ అయితే బాగుంటుందని... ఆయనకు 'ఈగ' సినిమాని చూపించారు. అజయ్‌కి ఈ సినిమా బాగా నచ్చింది. వెంటనే వాయిస్‌ ఓవర్‌ ఇవ్వడానికి ఒప్పుకొన్నారు అంటున్నారు. అక్టోబర్ 12 'మక్కి' చిత్రం బాలీవుడ్లో విడుదల అవుతోంది.

రిలయన్స్ ఎంటర్ టైనర్ వారు ఈచిత్రాన్ని బాలీవుడ్లో భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నాని, సమంత, సుదీప్ ప్రధాన పాత్రలు పోషించిన ఈచిత్రంలో రాజమౌళి దర్శకత్వానికి, సుదీప్ నటనకు, కళ్లు చెదిరే గ్రాఫిక్స్‌కు ప్రేక్షకులు ఫుల్ మార్కులు వేసేశారు. భారతీయ సినీ చరిత్రలోనే గొప్ప చిత్రంగా పేరు తెచ్చుకుంది.

ఈగ తెలుగు వెర్షన్‌లో టాలీవుడ్ టాప్ హీరోలను ఇమిటేట్ చేస్తూ స్టెప్పులేసింది. అయితే హిందీలోనూ అదే సీన్లు పెడితే అక్కడి ప్రేక్షకులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున.... బాలీవుడ్ టాప్ హీరోల డాన్స్ ను ఇమిటేట్ చేసేలా ఆ సీన్లను మోడరేట్ చేసినట్లు తెలుస్తోంది. హిందీ వెర్షన్లో సల్మాన్, హృతిక్ రోషన్ లాంటి వాళ్ల డాన్స్‌ను ఈగతో చేయిస్తారట. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని వారాహి చలన చిత్రం పతాకంపై సాయి కొర్రపాటి నిర్మించగా సురేష్ బాబు సమర్పణలో విడుదలైంది. ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి, కెమెరా: సెంథిల్ కుమార్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X