అల్లు అర్జున్,త్రివిక్రమ్ మధ్య విభేదాలు?
అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ చిత్రం త్వరలో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే.అయితే తాజాగా వినపడుతున్న దాన్ని బట్టి ఈ చిత్రం ఆగిపోయినట్లే అని తెలుస్తోంది.ఆస్ట్రైలియా నుంచి రాగానే వెంటనే అల్లు అర్జున్ ..దిల్ రాజు చిత్రం లో చేయనున్నాడని చెప్తున్నారు.దానికి కారణం కేవలం అల్లు అర్జున్ కి స్క్రిప్టు నచ్చకపోవటమేనని,అందులో చెప్పిన మార్పులు త్రివిక్రమ్ చేయలేదని అందుకే అల్లు అర్జున్ కాదనుకుంటున్నాడని వినపడుతోంది.మరో ప్రక్క దీన్ని ఆసరాగా తీసుకుని దిల్ రాజు తన ప్రాజెక్టుని పట్టాలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాడు.జోష్ వంటి మెగా ప్లాప్ ఇచ్చిన వాసు వర్మ దర్సకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది.మరో ప్రక్క త్రివిక్రమ్ కూడా ఈ ప్రాజెక్టుని ప్రక్కన పెట్టి మరో హీరోని ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడని చెప్పుకుంటున్నారు.అంతేగాక అల్లు అర్జున్ తాను ఇలా భుజం ఆపరేషన్ నిమిత్తం ఆస్ట్రైలియా వెళ్లిన సంగతి కేవలం మీడియా ద్వారానే తెలుసుకోవాల్సి వచ్చిందని త్రివిక్రమ్ బాధపడి తమ మద్య దూరం గుర్తించి వెంటనే వేరే హీరోని ఎప్రోచ్ అయ్యాడని చెప్పుకుంటున్నారు.


Click it and Unblock the Notifications











