twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బన్నీ బలి కాలేదు...తప్పించుకున్నాడు

    By Srikanya
    |

    హైదరాబాద్:'ఒక లైలా కోసం' చిత్రం రెండు రోజుల క్రితం అంటే శుక్రవారం విడుదలై డివైడ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్నా...రేపటి నుంచి డ్రాఫ్ అయ్యే అవకాసం ఉందని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథని ఇంతకు ముందు అల్లు అర్జున్ కి దర్శకుడు కొండా విజయ్ కుమార్ చెప్పిన విషయం సినిమా జనం గుర్తు చేసుకుంటున్నారు. కథ విన్న అల్లు అర్జున్ ..రిజక్ట్ చేసాడని, లేకపోతే ఈ ఫ్లాఫ్ టాక్ అతని ఖాతాలో పడేదని అంటున్నారు.

    అయితే అప్పుడు అల్లు అర్జున్ తనకు ఈ సబ్జెక్టు సూట్ కాదని, తనకు మాస్ ఎలిమెంట్స్ ఉన్న కథ అయితే బెస్ట్ అని చెప్పినట్లు సమచాారం. కథ ప్రకారం క్యూట్ గా ఉండే కుర్రాడని చూడమని చెప్పి తప్పించుకున్నాడని అంటున్నారు. అలాగే తను ఇద్దరమ్మాయిలతో చిత్రంలో లవర్ బోయ్ గా చేసాను కాబట్టి మళ్లీ అలాంటి కథ చేయటం ఇష్టం లేదని అన్నట్లు తెలుస్తోంది. ఇక మొదటి నుంచీ అల్లు అర్జున్ చాలా జాగ్రత్తగా స్క్రిప్టుల విషయంలో ఉంటున్నాడని అందుకే హిట్స్ కు ఢోకా లేకుండా వెళ్తున్నాడంటున్నారు.

    అల్లు అర్జున్ తాజా చిత్రం విషయానికి వస్తే...

    Why Allu Arjun Turned Down 'Oka Laila Kosam'?

    తెలుగుజాతి పౌరుషానికీ, కాకతీయ వీరత్వానికీ ప్రతీక గోనగన్నారెడ్డి. ఆ పాత్రలో అల్లు అర్జున్‌ ఒదిగిపోయిన తీరు మా చిత్రానికే ప్రధాన ఆకర్షణ అంటున్నారు గుణశేఖర్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'రుద్రమదేవి'. అల్లు అర్జున్‌, అనుష్క, రానా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 'రుద్రమదేవి'లో గోనగన్నారెడ్డి తొలి రూపు (ఫస్ట్‌లుక్‌)ను చిత్రబృందం విడుదల చేసింది. గుణశేఖర్‌ మాట్లాడుతూ ''యువత, మాస్‌ను ఆకట్టుకొనే పాత్రలో బన్నీ కనిపిస్తాడు. గోనగన్నారెడ్డిగా ఆయన పాత్ర ఎప్పటికీ గుర్తిండిపోతుంది.

    45 రోజుల పాటు బన్నీపై సన్నివేశాలు తెరకెక్కించాం. పీటర్‌ హెయిన్స్‌ నేతృత్వంలో రూపొందించిన పోరాట సన్నివేశాలు చిత్రానికి ప్రధాన ఆకర్షణ. నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయ''న్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్‌, కృష్ణంరాజు, నిత్యమీనన్‌, కేథరిన్‌, ఆదిత్యమీనన్‌, అజయ్‌, జయప్రకాష్‌రెడ్డి తదితరులు నటించారు. కళ: తోట తరణి, ఛాయాగ్రహణం: అజయ్‌ విన్సెంట్‌, కూర్పు: శ్రీకర్‌ ప్రసాద్‌, సమర్పణ: రాగిణీ గుణ

    English summary
    Vijay Kumar Konda narrated 'Oka Laila Kosam' story to Allu Arjun after Gundejaari Gallantayyinde released and doing well at box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X