మొన్న జరిగిన ఐటీ దాడుల్లో స్వీటీ అనుష్క చాలా హర్ట్ అయిందనీ, దాంతో ఒక రకమైన డిప్రెషన్ లోకి వెళ్ళిందని దాంతో తన సొంత ప్రాంతమైన బెంగుళూరుకు వెళ్ళిందని చెప్తున్నారు. ఈ విషయాలను బెంగుళూరు కు చెందిన మీడియా అంటోంది.అందులోనూ నాగార్జునతో ఆమెకు ఉన్న రిలేషన్ ని హైలెట్ అవటం ఆమెను మరింత బాధపెట్టిందని చెప్తున్నారు.దాంతో ఆమె తన చేతిలో ఉన్న ప్రాజెక్టులను తమిళ,తెలుగులతో సహా ప్రక్కన పెట్టి బెంగుళూరు చేరుకుందని చెప్తున్నారు.ఓ రకంగా ఆమె ట్రీట్ మెంట్ అన్నట్లుగా తన సన్నిహితుల పర్యవేక్షణలో ఆ ఆలోచనల నుండి బయిటపడేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్తున్నారు.షూటింగ్ లకు అనారోగ్యం అని చెప్పి బ్రేక్ ఇవ్వటంతో ట్రీట్మెంట్ బెంగుళూరు లో జరుగుతోందని,అందరూ ఫోన్ లు చేస్తున్నారని చెప్తున్నారు. దాంతో ఆమె సెల్ కూడా కట్టేసి పూర్తిగా ఈ విషయాలని మర్చిపోయే ప్రయత్నం చేస్తోందని చెప్తున్నారు.త్వరలోనే ఆమె కోలుకుని బిజీ కావాలని కోరుకుందాం.