అనుష్క ఎందుకని కొత్త సినిమాలు ఒప్పుకోవటం లేదు?
అరుంధతి స్టార్ గా ఎదిగిన అనుష్క ఆ తర్వాత మహేష్ వంటి హీరోల సరసన చేసి స్టార్ డమ్ ని సొంతం చేసుకుంది. అయితే తాజాగా కొత్త చిత్రాలు ఏమీ కమిట్ కావటం లేదు. దానికి కారణం ఆమె పెళ్ళి చేసుకోవటానికి నిర్ణయించుకోవటమేనని అంటున్నారు. పెళ్లి చేసుకుని త్వరగా సెటిలవ్వాలని చూస్తోందని అంటున్నారు. అయితే ఈ నిర్ణయానకి కొంత కాలం క్రిందటే వచ్చినా తమ స్నేహితుడు దర్శకుడు క్రిష్ ఒత్తిడితో తమిళ్ లో వేదం రీమేక్ వానం సినిమా చేసింది. అలాగే తనను మొదటి నుంచీ ఎంకరేజ్ చేస్తూ వస్తున్న నాగార్జున కోరికమేరకు ఢమురకం చిత్రం చేస్తోంది.ప్రభాస్ తో ఫ్రెండ్ షిప్ కారణంగా రెబల్ చేస్తోంది. ఈ చిత్రాలు కాకుండా వేరే ఏ హీరోలు డేట్స్ అడిగినా లేవని ఆఫర్లు వదిలేసుకుంది అనుష్క. దీన్ని బట్టి ఆమె ఏ నిర్ణయానికి వచ్చిందో అర్దం చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications











