అనుష్క శుభవార్త చెప్పబోతోందా? అందుకే అక్కడికి వెళ్ళింది అంటున్నారు!
Recommended Video

ప్రస్తుతం అనుష్క చేసే సినిమాలు పూర్తి కాగానే పెళ్లి చేసుకోనుంది అనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే. అనుష్క, ప్రభాస్ వృతి పరంగా ఫ్రెండ్స్ అయిఉండొచ్చు కాని వారిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.

పెళ్లి వార్తలు
అందాలతార అనుష్క నటించిన భాగుమతి సినిమా ఇటీవలే విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా తరువాత ఆమె మరిన్ని సినిమాలు చెయ్యబోతోంది. ప్రస్తుతం అన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. త్వరలో వాటి వివరాలు అనుష్క స్వయంగా ప్రకటించబోతోంది. ప్రస్తుతం అనుష్క చేసే సినిమాలు పూర్తి కాగానే పెళ్లి చేసుకోనుంది అనే వార్తలు వచ్చిన విషయం తెల్సిందే.

నిజం లేదు
అనుష్క పెళ్లిపై ఇటీవల చాలా పుకార్లు చెలరేగుతున్నాయి. అనుష్క సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తినే పెళ్లి చేసుకోనుందని కొందరు అంటే కాదు ఆమె తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే చేసుకుంటుంది అని చాలా రకాల వార్తలు వస్తున్నాయి. కాని వాటిలో నిజం ఎంతుందో తెలియాలంటే అనుష్క స్వయంగా చెప్పాల్సిందే.

ఫ్రెండ్స్ మాత్రమే
ప్రభాస్, అనుష్కలు గత ఏడాది డిసెంబర్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని , వారిద్దరూ నిజంగానే రిలేషన్‌షిప్‌లో ఉన్నారంటూ వార్తలు వచ్చాయి, కాని ఆ న్యూస్ లో నిజం లేదని తెలిసిపోయింది. అనుష్క, ప్రభాస్ వృతి పరంగా ఫ్రెండ్స్ అయిఉండొచ్చు కాని వారిద్దరి మధ్య ఏం లేదని సమాచారం.

గుడిలో అనుష్క
తాజాగా అనుష్క కేదార్ నాథ్ టెంపుల్ లో దర్శనం ఇచ్చింది. టెంపుల్ లో అనుస్కను చుసిన కొంతమంది ఆమెతో ఫోటోలు దిగడం జరిగింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తున్నాయి. ఫోటోలలో అనుష్క పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని కనిపిస్తుండడం విశేషం. త్వరలో తన పెళ్లి శుభవార్త చెప్పబోతోంది అనుష్క, అందుకే గుడికి వెళ్లిందని అంటున్నారు కొందరు అభిమానులు.

రీజన్ అదే అంటున్నారు
అనుష్క కేదార్ నాథ్ గుడికి వెళ్ళడానికి కారణం తన వివాహం గురించేనని సమాచారం. త్వరగా తనకు వివాహం జరగాలని అనుష్క కేదార్ నాథ్ టెంపుల్ లో పూజా జరిపించినట్లు తెలుస్తోంది. కుటుంభ సభ్యులు ఈ పూజలో పాల్గోనట్లు తెలుస్తోంది. రహస్యంగా ఎవ్వరికి తెలీకుండా ఈ పూజా జరిపించాలని అనుకన్న అనుష్క చివరికి కొందరు అభిమానులు ఆమెతో కలిసి ఫోటోలు దిగడంతో విషయం బయటకు వచ్చింది.


Click it and Unblock the Notifications











