బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ అటకెక్కినట్టేనా? త్రివిక్రమ్ ఎంట్రీతో సీన్ రివర్స్!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఆయన అభిమానుల్లో కన్ఫ్యూజన్ నెలకొంది. గత కొన్ని రోజుల నుంచి పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ - అట్లీ కాంబో తెరపైకి రాబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ తాజాగా మధ్యలోకి త్రివిక్రమ్ దూరడం చూస్తుంటే ఈ ప్రాజెక్ట్ అటకెక్కిందా? అన్పిస్తోంది. మరి బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనిపించే ఆ తాజా పరిస్థితులు ఏంటి అనే విషయంపై ఏ లుక్కేద్దాం.
రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న విషయం తెలిసిందే. ఏప్రిల్ 8న బన్నీ బర్త్ డే వేడుక కాగా, ఆ రోజున ఆయన సినిమాలకు సంబంధించిన పలు అప్డేట్స్ ను రిలీజ్ చేసి అల్లు ఫ్యాన్స్ ను ట్రీట్ ఇచ్చారు మేకర్స్. అందులో భాగంగానే పుష్ప 2 నుంచి గంగమ్మ జాతర టీజర్ రిలీజ్ చేశారు.

అలాగే ఊహించని విధంగా త్రివిక్రమ్ నుంచి కూడా ఒక అప్డేట్ ఊడిపడింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అట్లీ సైలెన్స్. అల్లు అర్జున్ నెక్స్ట్ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీతో సినిమా చేయబోతున్నాడు అని జరుగుతున్న ప్రచారం దృష్ట్యా అట్లీ ఆ ప్రాజెక్ట్ కు సంబంధించిన అప్డేట్ ఇస్తారేమో అని ఆశగా ఎదురు చూశారు అభిమానులు.
అయితే అప్డేట్ కాదు కదా అట్లీ కనీసం విష్ కూడా చేయలేదు. ఇదే ఇప్పుడు బన్నీ అభిమానులను కన్ఫ్యూజన్ లోకి నెట్టేసింది. అలాగే బన్నీ, అట్లీ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుధ్ ఎంపిక అయ్యాడని వార్తలు వచ్చాయి. అయితే ఆయన కూడా బన్నీ బర్త్ డే రోజున మౌనం వహించడం పలు అనుమానాలకు తెర తీస్తోంది.
నిజానికి గుంటూరు కారం మూవీ తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పట్టాలెక్కాల్సి ఉంది. కానీ గుంటూరు కారం మూవీ రిజల్ట్ కారణంగా బన్నీ గురూజీని పక్కన పెట్టేసాడని రూమర్లు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే అల్లు అర్జున్, అట్లీ ప్రాజెక్ట్ తెరపైకి వచ్చింది. అలాగే అట్లీ ఈ మూవీ కోసం ఇప్పటికే అనిరుధ్ తో కలిసి మ్యూజిక్ సిట్టింగులు వేశాడని ప్రచారం జరిగింది.

కానీ సడన్ గా త్రివిక్రమ్ బన్నీ బర్త్ డే రోజున విష్ చేస్తూ ఆయనతో కలిసి సినిమా చేయడానికి ఎదురు చూస్తున్నానని ట్వీట్ చేశారు. దీంతో త్వరలోనే వీళ్లిద్దరి కాంబోలో ప్రాజెక్ట్ రాబోతోంది అనే విషయం అయితే కన్ఫర్మ్ అయ్యింది. కానీ అట్లీ సైలెన్స్ వెనక అర్థమేంటి? బన్నీ, అట్లీ ప్రాజెక్ట్ అటాకెక్కినట్టేనా? అనే డౌట్ మొదలైంది సినీ ప్రియులకు.
వారి అనుమానం తీరాలంటే అసలు ఆ క్రేజీ ప్రాజెక్టు ఉందా లేదా అనే విషయంపై అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ పుష్ప 2పై కాన్సన్ట్రేట్ చేశారు. ఈ మూవీ ఆగస్ట్ 15న థియేటర్లోకి రాబోతోంది.


Click it and Unblock the Notifications











