కోమరంపై బాలయ్యకి ఎందుకంత ప్రేమ....!
సింహా తర్వాత బాలయ్య నటిస్తున్న చిత్రం పరమవీరచక్ర. దాసరి దర్శకత్వంలో రూపోందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ రావణబ్రహ్మ, కొమరం భీమ్ వంటి ప్రత్యేకమైన గెటప్స్ లో కనిపించనున్నారు. పౌరాణిక పాత్రల గురించి బాలయ్య బాబుకి చాలా పరిజ్ఞానం ఉంది. వాటి గురించి ఎక్కువగా ఆలోచించవలసిన అవసరం బాలయ్యకి లేదు. కానీ ఈ సినిమాలో బాలయ్య బాబు కొమరం భీమ్ గెటప్ కొసం ఎంతో కేర్ తీసుకున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. అంతే కాకుండా కొమరం భీమ్ గురించి తెలిసిన వాళ్శతో మాట్లాడి, ఆయనకు సంబంధించిన విషయాలు తెలుసుకోని ఆ గెటప్ వేశారు బాలయ్య బాబు. సినిమాలో వచ్చే ఒక చిన్న గెటప్ కి బాలయ్య బాబు అంత కేర్ తీసుకోని ఆ గెటప్ వేయడంతో బాలయ్య బాబుని ఈ విషయంలో అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అంతేకాకుండా ఆ గెటప్ ఇంకా బాగా రావడానికి కొమరం భీమ్ జీవితాన్ని స్టడీ చేసి, కొమరం భీమ్ చిత్రానికి దర్శకత్వం వహించిన అల్లాణి శ్రీధర్ ని షూటింగ్ స్పాట్ కి పిలిపించి మరీ ఆగెటప్ ను షూట్ చేసిన రెండు రోజులు పాటు ఆయన సలహాలు తీసుకున్నారని సమాచారం. దాంతో ఈ గెటప్ చాలా బాగా వచ్చిందని యూనిట్ అందరూ అనుకుంటున్నారు. అసలు బాలయ్య బాబు ఈ గెటప్ పై ఎందుకింత ఆలక్తి చూపిస్తున్నారంటే, కొమరం పులి సినిమాకు గాను కొమరం అనే పేరు మీద చాలా గోడవలు జరిగాయి. కాబట్టి అటువంటి గోడవలు తమ సినిమాలో జరగకూడదనేమో అంతలా ఆ గెటప్ పై శ్రద్ద తీసుకున్నారని ఫిల్మ్ వర్గాల బోగట్టా.


Click it and Unblock the Notifications











