హీరో రామ్ పై నిర్మాత రివెంజ్
కందిరీగ చిత్రం రెమ్యునేషన్ విషయంలో నిర్మాత బెల్లంకొండకీ, హీరో రామ్ కి మధ్య విభేధాలు వచ్చిన సంగతి తెలిసిందే. దాదాపు కోటి రూపాయలు వరకూ ఎగ్గొట్టే ప్రయత్నం చేసాడంటూ రామ్ మూవీ ఆర్టిస్ట్స్ అశోసియేషన్ కి కంప్లైంట్ చేసి వసూలు చేసుకున్నారు. ఈ నేపధ్యంలో బెల్లంకొండ సురేష్ ఇప్పుడు రామ్ పేరు ఎత్తితే మండిపడుతున్నాడు. అతనిపై రివేంజ్ తీర్చుకోవాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్తున్నారు. అందులో భాగంగానే రామ్ కి కందిరీగ ప్రమేషన్ కి ప్రక్కన పెట్టాడు. అంతేగాక సినిమాలో నటించిన సోనూసూద్ ని హైలెట్ చేస్తూ స్టేట్మెంట్స్ ఇస్తున్నాడు.
సోనూసూద్ బాగా చేసాడని, సినిమా అతనే నిలబెట్టాడని, అతన్ని హీరోగా పెట్టి సినిమా ప్లాన్ చేస్తానని అని చెప్పటం ద్వారా రామ్ ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు. అందులోనూ వరస ప్లాప్ ల్లో ఉన్న రామ్ కి అంత ఖర్చు పెట్టి హిట్ ఇవ్వడం మామూలు విషయం కాదని అంటున్నాడు. ఈ నెగిటివ్ ప్రచారం రామ్ కి ఎంతవరకూ మైనస్ అవుతుందో కానీ అతను మాత్రం కూల్ గా ఉన్నాడు. బెల్లంకొండ మరో సినిమా గౌతమ్ మీనన్ దర్శకత్వంలో చేస్తానని కమిటైంది మాత్రం ఓకే చేయటం లేదు. స్క్రిప్టు నచ్చటం లేదని తిరస్కరిస్తున్నాడు. వీరి మధ్య గౌతమ్ మీనన్ విషయం అర్దం కాక నలిగిపోతున్నాడు.


Click it and Unblock the Notifications











