అల్లుఅర్జున్ 'రేసుగుర్రం' ఇంత లేటు ఎందుకు?
మొదట సురేంద్రరెడ్డి చెప్పిన లైన్ ఓకే చేసిన అల్లు అర్జున్ తర్వాత ఆ కథ వద్దని, వేరే కథ చూడమని చెప్పటంతో మళ్లీ వేరే స్క్రిప్టు రెడీ చెయ్యటానికి ఇంతకాలం పట్టిందని చెప్తున్నారు. దానికి తోడు సురేంద్రరెడ్డి రచయిత వక్కంతం వంశీ సైతం ఎన్టీఆర్ తో సొంతం గా డైరక్షన్ లోకి దిగుతూండటంతో ఆయన ఆ బిజీలో ఉండటం కూడా ఈ లేటుకి కారణమంటున్నారు.
పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రస్తుతం పూర్తి స్క్రిప్టుతో సురేంద్ర రెడ్డి మలిచి దిగుతున్నాడని, కిక్ లాంటి హిట్ ఇస్తానని నమ్మకంగా ఉన్నాడని చెప్తున్నారు. ఇక ఓవైపు అల్లు అర్జున్ తాజా చిత్రం ఇద్దరమ్మాయిలతో విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ చిత్రం ఇంతకుముందే ప్రారంభం కావలసిఉన్నప్పటికీ, అల్లు అర్జున్ ఇద్దరమ్మాయిలతో బిజీగా ఉండటంతో రేసుగుర్రం ప్రారంభాన్ని వాయిదా వేసినట్లు చిత్ర నిర్మాతలలో ఒకరైన నల్లమలుపు శ్రీనివాస్ చెప్పారు. హీరోయిన్‌గా నటిస్తున్న శృతిహాసన్‌కూడా హిందీచిత్రం రామయ్యా వస్తావయ్యా వంటి పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తిచేసుకుని షూటింగ్‌కు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
మొదటి షెడ్యూల్‌లోనే ఆమె షూటింగ్‌లో పాల్గొంటారని చెప్పారు. ప్రకాష్‌రాజ్, సుహాసిని మణిరత్నం, బ్రహ్మానందం, ఆలీ, ఎమ్‌ఎస్ నారాయణ, రఘుబాబు, కోటశ్రీనివాసరావు కీలకపాత్రలలో నటిస్తున్నట్లు తెలిపారు. చిరంజీవి తోడల్లుడు వెంకటేశ్వరరావు సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సురేందర్‌రెడ్డి కాగా, ఎస్‌ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications












