చిరు 150 నుంచి క్యాథరిన్ ని తీసేసారు..... షూటింగ్ లో లారెన్స్ తోనే అంత గొడవ పెట్టుకుందట

మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ సినిమా అయిన 'ఖైదీ నెం. 150' కొద్ది నెలలుగా నిరంతరాయంగా షూటింగ్ జరుపుకుంటోన్న విషయం తెలిసిందే. వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో చిరు తనయుడు రామ్ చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కానున్న ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉండడంతో, అనుకున్న తేదీకే సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేయాలని టీమ్ శరవేగంగా షూటింగ్ పూర్తి చేస్తోంది.

ఈ సినిమాలో క్యాథ‌రిన్ థెస్రా ఓ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ని వార్త‌లు విన‌ప‌డ్డాయి. యూనిట్ వ‌ర్గాలు కూడా ఖ‌రారు చేశాయి. అయితే ఏమైంతో ఏమో కానీ ఇప్పుడు లెటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఈ సినిమాలో క్యాథ‌రిన్ ప్లేస్‌లో ల‌క్ష్మీరాయ్ స్పెష‌ల్ సాంగ్ చేస్తుంద‌ట‌. మ‌రి క్యాథరిన్ స్పెష‌ల్ సాంగ్ ఎందుకు చేయ‌లేద‌నే దానిపై నిన్నటి వరకూ ఎటువంటి స‌మాచారం లేదు.

అదేమిటో గానీ చిరు సెకండ్ ఇన్నింగ్స్ కి ఫేమేల్ యాక్టర్స్ అచ్చి రాలేదు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రకటించిన కాజల్ పేరుకి మొదట్లో విమర్శలు ఎదురైనా మెగా కాంపౌండ్ లో ఆమెకున్న ట్రాక్ రికార్డ్, ఇటీవల జనతా గ్యారేజ్ లో ఐటెం సాంగ్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి మంచి నిర్ణయమే అని ఫిక్సయ్యారు. నెమ్మదిగా కాజల్ తో చిరు జంతని చూసి పర్లేదు అనుకున్న సమయం లో... ఐటం సాంగ్ కోసం ఇంకో నటి కావాల్సి వచ్చింది. ఎంత వేరే సినిమాల్లో ఐతం పాప గా చేసినా ఇక్కడ హీరోయిన్ గా ఉన్న కాజల్ తో ఆ సంగ్ చేయించలేరు కాబట్టి మరో అమ్మాయి కోసం వెతికారు.

Why Catherine Tresa walked out of Chiru 150 ?

ఈ ఐటెం సాంగ్ లో చిరు సరసన చిందేయడానికి కేథరీన్ త్రేసా ని ఫిక్స్ చేసినట్టు సమాచారం రావటం తోనే కాస్త వింత గా ఫీలయ్యారంతా.., ఈ వార్త ముందుగా అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. చిరుతో సరితూగే స్టెప్పులు వేయగల తమన్నా, అనుష్కలాంటి పీద హీరోయిన్లుండగా వాళ్లని కాదని కేథరీన్ ని తీసుకోవటం అంతగా రుచించలేదు. అయితే సరైనోడు సినిమాలో అల్ అర్జున్ తో పబ్ సాంగ్ లో ఇరగదీసినందుకే కేథరీన్ కి చిరు పిలిచిమరీ ఈ అవకాశం ఇచ్చినట్టు తెలిసింది. సరే అంతా సమాధాన పడ్డారు.. క్యాథరిన్ తో అన్నయ్య స్టెప్పులు ఎలా ఉంటాయో ఊహించుకొని ఎదురు చూసారు. ఇకపోతే ఇప్పుడు ఆమెను రీప్లేస్ చేశారనే న్యూస్ వస్తోంది. ఎందుకంటే ఆమె ఒక గొడవ కారణంగా అవుటాఫ్ ప్రాజెక్టు అనే టాక్ వస్తోంది.

నిజానికి క్యాథరీన్ నిన్నటి నుండే షూటింగ్ మొదలెట్టింది. అయితే చిరంజీవికి చాలా క్లోజ్ గా ఉండే ఒక చీఫ్ టెక్నీషియన్ తో క్యాథరీన్ గొడవపడటంతో.. ఆమెను షూటింగ్ నుండి తప్పించారట. ఆమె ప్లేసులో మరో హీరోయిన్ లక్ష్మీ రాయ్ ను తీసుకున్నారని తెలుస్తోంది. అదేంటోగాని.. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో నటించిన కాజల్ ను హీరోయిన్ ను తీసుకోవడం.. అదే సినిమాలో ఐటెం బాంబుగా చేసిన లక్ష్మీ రాయ్ ను ఇప్పుడు ఐటెం సాంగుకే తీసుకోవడం.. ఖైదీ నెం 150కే చెల్లింది.

అయితే క్యాథరిన్ గొడవ పడింది ఎవరితోనో కాదు ఈ సాంగ్ కి డాన్స్ కంపోజ్ చేస్తున్న లారెన్స్ తోనేనన్నది టాలీవుడ్ టాక్. ఆయన చెప్పిన కాస్ట్యూమ్స్ వేసుకోకుండా ఆయన చెప్పిన స్టెప్పులను ప్రాక్టీస్ చేయకుండా షూటింగ్ ను డిలే చేయడంతో ఆమెను తీసేశారని అంటున్నారు. ఎంతవరకు నిజమో మరి క్యాథరీనే చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X