రామ్ చరణ్ నిశ్చితార్దం వెన్యూ ఛేంజ్ కి కారణం
రామ్ చరణ్,ఉపాసన ల నిశ్చితార్దం మొదటి అనుకున్నట్లు దోమకొండలో గా కాకుండా హైదరాబాద్ లో జరగనుంది.అయితే వెన్యూ ఛేంజ్ కావటానికి కారణం అక్కడ వాస్తు దోషమే కారణమని తెలుస్తోంది.అయితే విఐపి ల భద్రతా ఏర్పాట్లు ఇబ్బందవుతుందనే మార్చారని మరో వాదన వినపడుతోంది.అయితే దోమకొండ వాసులు మాత్రం ఈ వార్త వినగానే బాగా డీలా పడ్డారు.అక్కడ వారు మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ నిశ్చితార్దం అనగానే తామంతా చాలా ఆనందపడ్డామని,తమ బంధువులు స్నేహితులు తమకో పాస్ కావాలని తమను అడుగుతున్నారని ఈ నేపధ్యంలో ఇక్కడ ఎంగేజ్ మెంట్ కాన్సిల్ కావటం ఊహించలేకపోతున్నామని అంటున్నారు.అయితే చిరు కుటుంబం కానీ,ఉపాసన కుటుంబం గానీ ఈ విషయమై ఏమీ స్పందించటం లేదు.అయితే ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయినా పెళ్లి వేడుకల్లో ఏదో ఒకటి అయినా తమ గ్రామంలో ఏర్పాటు చేస్తే తమకు కన్నుల పండుగగా ఉంటుందని వారు చెప్తున్నారు.అలాగే ఏటా మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఉమాపతిరావు కుటుంబ సభ్యులతో కలిసి రెండు రోజుల పాటు ఈ గడిలో గడుపుతారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చెందిన కళాకారులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉమాపతిరావు కుమారుడైన అనిల్ జాతీయ విలువిద్య క్రీడాకారుడు. గడిలో విద్యార్థులకు విలువిద్యలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. ఇక ఈ ఎంగేజ్ మెంట్ కోసమని ఎప్పటినుంచో బాగు చెయ్యకుండా ఉంచిన గడీని మాత్రం చాలా ఖర్చుతో మరామత్తులు ప్రారంభించారు.వాటిని మాత్రం కంటిన్యూ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











