'పంజా'పంక్షన్ కి మెగా ఫ్యామిలీ దూరం..ఎందుకు
పంజా ఆడియో పంక్షన్ చూసిన వాళ్లందరికీ ఇప్పుడు ఒకటే అనుమానం.ఎప్పుడూ ఉమ్మడిగా ఉండే చిరు కుటుంబంలో ఏమన్నా తేడాలు వచ్చాయా.లేకుండా పవన్ కళ్యాణ్ పంక్షన్ కి కుటుంబ సభ్యులు ఎవరూ హాజరు కాకపోవటానకి కారణం ఏమిటి..పంజా ఆడియో ఫంక్షన్ అట్టహాసంగా జరిగినా మెగా అభిమానుల్లో మాత్రం ఏదో వెలితి.సినిమా ఫంక్షన్ అయినా,కుటుంబ ఫంక్షన్ అయినా ఆ కుటుంబంలో అందరూ వాలిపోతారు.మరి ఇప్పుడు వాళ్ళకి ఏమైంది.పంజా ఆడియో రిలీజ్ కు రాకుండా వాళ్లంతా ఎక్కడికి వెళ్లారు.ఇప్పుడు ఇదే అభిమానులును వేధిస్తున్న ప్రశ్నలు.మామూలుగా అయితే కుటుంబ సభ్యులంతా బిజీగా ఉన్నా మెగాస్టార్ తప్పకుండా హాజరయ్యేవారు.కానీ పంజా ఫంక్షన్ లో ఆ లెక్క తప్పింది.పవన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పంజా ఆడియో పంక్షన్ లో కొడుకు అకీరా తప్ప కుటుంబ సభ్యులెవరూ లేరు.అన్నలే కాదు కనీసం పవన్ భార్య రేణూ దేశాయ్ కూడా రాలేదు.ఇదే విషయం సినీ,రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
గతంలో ఆరెంజ్ ఆడియో పంక్షన్ కి రామ్ చరణ్ షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండి హాజరు కాకపోయినా ఇతర రాష్ట్రాల్లో ఉన్న పవన్ మాత్రం తన కార్యక్రమాలని మాత్రం రద్దు చేసుకుని హాజరయ్యాడు.దాంతో నిజంగా చిరంజీవి కుటుంబంలో పవన్ కి సంభంధాలు తెగిపోయాయాయా.అందులోనూ పవన్ కళ్యాణ్ ప్రసంగం అభిమానుల్లో టెన్షన్ మరింత పెంచింది.కొత్త అనుమానాలను రేకిత్తించింది.తన సినిమా అంటే తనను చూడటానకే వస్తున్నారా లేక తనను చూడటానకే వస్తున్నారా అనే అనుమానం మొదట్లో ఉండేదని అంటున్నాడు.అంతేగాక వారసత్వాన్ని నమ్ముకోలేనని కామెంట్ సైతం చేసాడు.ఇటీవల పరిణామాలను దగ్గరనుంచి చూసిన వారు చిరంజీవికి,పవన్ కళ్యాణ్ కి మనస్పర్దలు వస్తే దానికి కారణం రాజకీయాలే కారణం అంటున్నారు.పిఆర్పీ పార్టీని చిరంజీవి పెట్టిన తొలినాళ్లలో పవన్ కల్యాణ్ పార్టీలో ప్రత్యేక ఆకర్షణగా మారారు.
పంచలూడతీసి తరిమి కొట్టండంటూ ఓ సారి కాంగ్రేస్ నేతల పై విరుచుకు పడ్డాడు కూడా.అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు.అదే కాంగ్రేస్ లో చిరంజీవి తన పార్టీని విలీనం చేసారు.అది పవన్ కి నచ్చలేదని,పీఆర్పీ విలీనాన్ని తీవ్రంగా వ్యతిరేకించినట్లుగా అభిమానులు భావిస్తున్నారు.ఇదే విషయంలో అన్నతో మనస్పర్దలు వచ్చి ఉండవచ్చునని భావిస్తున్నారు.అందుకే పంజా పంక్షన్ కి చిరంజీవి దూరంగా ఉన్నారని వినిపిస్తోంది.ఆయనే వెళ్లంది తామెందుకు అనుకున్నట్లుగా చరణ్,బన్నీ,నాగబాబు కూడా పంక్షన్ కి దూరంగా ఉన్నారు.


Click it and Unblock the Notifications











