'గబ్బర్ సింగ్'నిర్మాత మీద దాసరి కోపం దేనికి?
ప్రముఖ దర్శకుడు,నిర్మాత,పంపిణీదారుడు దాసరి నారాయణరావు..గబ్బర్ సింగ్ నిర్మాత బండ్ల గణేష్ మీద కోపంగా ఉన్నారా..అవుననే ఫిల్మ్ సర్కిల్స్ లో అంటున్నారు. దానికి నిదర్శనం...అల్లు అర్జున్ జులాయి పంక్షన్ లో...జరిగిన విశేషం చెప్తున్నారుప. ఆయన జులాయి ఆడియో పంక్షన్ కి గెస్ట్ గా వచ్చారు. ఆయన ఆడిటోరియంలోకి ఎంటర్ కాగానే అందరూ విష్ చేసి గ్రీట్ చేసారు. గబ్బర్ సింగ్ నిర్మాత కూడా వినయంగా వంగి ఆయన బ్లెస్లింగులు తీసుకున్నారు. అయితే ఆయన మొహం మార్చుడుని ఎవాయిడ్ చేసి వెళ్లిపోయారని చూసిన వాళ్లు చెప్తున్నారు.
ఇంతకీ ఆయన కారణానికి కారణం..గబ్బర్ సింగ్ రైట్స్ నైజాం ఏరియా ఆయనకు ఇవ్వలేదని తెలుస్తోంది. సినిమా పెద్ద విజయం సాధించింది. దాంతో ఆయన చాలా భాదగా ఉన్నట్లు చెప్తున్నారు. అయితే ఆయన ప్రస్తుతం జులాయి రైట్స్ తీసుకున్నారు. అల్లు అర్జున్,త్రివిక్రమ్ కాంబినేషన్ మీద మంచి నమ్మకాలే ఉన్నాయి. ఈ సినిమా మంచి విజయం సాధింస్తుందని ట్రేడ్ లో వినపడుతోంది. ఖలేజా తర్వాత త్రివిక్రమ్ చేసిన ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్,యాక్షన్ కరెక్టుగా మిక్స్ అయ్యిందని,అదే ప్లస్ అవుతుందని అంటున్నారు.
'జులాయి' స్టోరీలైన్ విషయానికి వస్తే...పని, పాట లేకుండా తిరిగేవాడ్ని పెద్దలు 'జులాయి' అంటుంటారు. ఆ పెద్దలే... మగాడు తిరక్క చెడతాడు... ఆడది తిరిగి చెడుతుంది అని సూక్తులు వల్లిస్తుంటారు. వీటిల్లో ఏది కరెక్ట్? ఈ ప్రశ్నకు సమాధానం దొరకడం చాలాకష్టం. అందుకే ఆ పెద్దల తిట్లను కూడా ఆశీర్వాదాలుగా తీసుకుంటుంటాడు ఓ కుర్రాడు. వాళ్లు 'వెధవ' అన్నా... 'వెయ్యేళ్లు ధనముతో వర్థిల్లు' అని దీవించినంత ఆనందపడిపోతాడు. అలాంటి కుర్రాడికి ఓ కుర్రది తారసపడితే... ఇక ఆ సందడికి హద్దు ఉంటుందా... అల్లు అర్జున్ 'జులాయి' సినిమా నడక ఇలాగే ఉంటుంది .
సోనూసూద్, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఎమ్మెస్ నారాయణ, రావు రమేష్, బ్రహ్మాజీ, తులసి, హేమ, ప్రగతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: ప్రవీణ్ పూడి, నిర్మాణం: హారిక అండ్ హాసిని క్రియేషన్స్.సంగీతం: దేవిశ్రీప్రసాద్, నిర్మాత: ఎస్.రాధాకృష్ణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications











