అనుష్కని టార్గెట్ చేయాల్సినంత కోపం దాసరికి ఏమి వచ్చింది?
ఓపెనింగులు, ఫంక్షన్లకు హీరోయిన్స్ ను పిలవవద్దని పరోక్షంగా అనుష్కను ఉద్దేశించి దాసరి చేసిన వ్యాఖ్యల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యాఖ్యలు అనుష్కని ఉద్దేశించే అన్నది సినీ పరిశ్రమతో కొద్దిగా పరిచయం ఉన్న ఎవరికైనా ఇట్టే అర్దమైపోతాయి. అయితే హఠాత్తుగా దాసరి ఎందుకని అనుష్కని దుయ్యబట్టారు అంటే... దర్శకరత్న తదుపరి చిత్రంలో అనుష్కను నటించమని కోరారట. ఆ చిత్రం ఒసేయ్ రాములమ్మ తరహాలో ఉంటుంది. ఆ చిత్రం టైటిల్ రామ సక్కని తల్లి. అయితే దాసరి చెప్పిన స్టోరీ అనుష్కకు నచ్చకపోవడంతో ఆమె నో చెప్పిందిట. అంతేకాకుండా దాసరి బర్త్ డే సందర్భంగా జరిగిన కార్యక్రమానికి కూడా అనుష్కను ఆహ్వానించినా టైం లేదని చెప్పడమే కాకుండా ఇలాంటి ఫంక్షన్లంటే తనకు ఇష్టం లేదని చెప్పింది. దీంతో దాసరినారాయణరావుకు కోపం వచ్చి అనుష్కపై తీవ్రమైన విమర్శలు చేసారని ఫిల్మ్ నగర్ వాసులు అంటున్నారు. నిజానికి అనుష్క నిర్మాతలకు చాలా ఫేవర్ గా ఉంటుందని, సినిమా రిలీజ్ అయిన తర్వాత డేట్స్ ఎంత బిజీగా ఉన్నా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటుందని, అలాంటి హీరోయిన్ పై విమర్శలు చేయడం తగదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే అనుష్క మాత్రం దాసరి ని పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ఆయన కామెంట్స్ చేసిన రెండురోజుల తర్వాత చెన్నైలోని ఓ షాపింగ్ మాల్ లో ఆమె హంగామా చేసింది.


Click it and Unblock the Notifications











