Deepika Padukone: రణ్‌వీర్- దీపిక మధ్య విభేదాలు? ధురంధర్ 2 సక్సెస్‌పై దీపిక మౌనం వెనుక..
బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ధురంధర్ ది రివెంజ్ (ధురంధర్ 2). మార్చి 19న వరల్డ్ వైడ్‌గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైంది. ధురంధర్ బ్లాక్‌బస్టర్ కావడంతో రెండో భాగంపై భారతీయ చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగినట్లుగానే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో ధురంధర్ 2 సంచలనం సృష్టిస్తోంది. ఈ సినిమాను వీక్షించిన సామాన్యులతో పాటు ప్రముఖులు ఆశ్చర్యపోతున్నారు. దర్శకుడు ఆదిత్యతోపాటు హీరో రణ్‌వీర్ సింగ్, చిత్ర యూనిట్‌ను అభినందిస్తున్నారు. అయితే ఒకరి మౌనం మాత్రం ఇండస్ట్రీ వర్గాలను, అభిమానులకు షాకిచ్చిది. ఈ వివరాల్లోకి వెళితే..
ధురంధర్ 2 కోసం భారతీయ చిత్ర పరిశ్రమ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసింది. దానికి తగినట్లుగానే ప్రీమియర్స్, కలెక్షన్స్ విషయంలో భారీ వసూళ్లతో ధురంధర్ 2 విధ్వంసం సృష్టించింది. రెండు రోజుల్లో ఏకంగా 330 కోట్లకు పైగా వసూళ్లతో 500 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళ్తోంది ధురంధర్ 2. ఈ క్రమంలోనే అనేక రికార్డులను బద్ధలు కొడుతోంది. ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు కూడా ఈ మధ్యకాలంలో ఎదురుచూసింది ధురంధర్ 2 కోసమే అని చెప్పొచ్చు. చివరికి తెలుగు వెర్షన్ రిలీజ్ కానప్పటికీ హిందీ వెర్షన్‌లోనే ఈ సినిమాను వీక్షించారు తెలుగు ప్రజలు.

ధురంధర్ 2 రిలీజ్ తర్వాత ఈ మూవీకి సంఘీభావంగా మొట్టమొదట స్పందించింది కూడా తెలుగు హీరోలే. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్ ఈ మూవీ ప్రీమియర్స్ వీక్షించిన వెంటనే ధురంధర్ 2 అద్భుతమని కొనియాడారు. బన్నీతో పాటు విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్‌లు సైతం ధురంధర్ 2పై రివ్యూలు ఇచ్చారు. ఆదిత్య ధర్ భారతీయ సినిమాకు గర్వకారణమని, రణ్‌వీర్ సింగ్ నటన సూపర్ అని మెచ్చుకున్నారు.
అయితే సొంత ఇండస్ట్రీ అయిన బాలీవుడ్ నుంచి మాత్రం ధురంధర్ 2కు ఆశించిన స్థాయిలో స్పందన రావడం లేదు. ఎవరో ఒకరిద్దరు తప్పించి రణ్‌వీర్‌కు మద్ధతుగా నిలిచిన బాలీవుడ్ సెలబ్రిటీలు చాలా తక్కువ. హిందీ ఇండస్ట్రీ నుంచి హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ వంటి వారు మాత్రమే ధురంధర్ 2 కోసం పోస్టులు పెట్టారు. ఎవరు సపోర్ట్ చేసినా చేయకపోయినా ఓకే కానీ ఒక ప్రముఖ వ్యక్తి మాత్రం రణ్‌వీర్ సింగ్ విజయాన్ని పట్టించుకోకపోవడం బాలీవుడ్ వర్గాలకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ నటి దీపికా పదుకొనె. భర్త రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ బ్లాక్‌బస్టర్ టాక్‌తో దూసుకెళ్తుండటంతో పాటు తొలి వారంలోనే 500 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించే దిశగా పయనిస్తోంది. పలువురు ప్రముఖులు.. రణ్‌వీర్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అయితే కట్టుకున్న భార్య దీపిక మాత్రం ఇంత వరకు స్పందించలేదు. ధురంధర్ 2కు మద్ధతుగా కనీసం ఒక పోస్ట్ కూడా పెట్టలేదు, సక్సెస్ సెలబ్రేషన్స్‌లోనూ దీపిక పదుకొనే కనిపించలేదు. ఇప్పుడే కాదు.. ధురంధర్ 2 విడుదలకు ముందు కూడా దీపిక చప్పుడు చేయలేదు. కనీసం ధురంధర్ 2ని థియేటర్‌లోనైనా వీక్షించిందా? లేదా అంటూ నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.
ఈ పరిణామాలతో దీపిక పదుకొనె- రణ్‌వీర్ సింగ్ దాంపత్యంపై అనేక అనుమానాలు వినిపిస్తున్నాయి. వారిద్దరి మధ్య విభేదాలు నెలకొన్నాయని, అందుకే దీపిక స్పందించడం లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. రణ్‌వీర్ ధురంధర్ 2 సక్సెస్ పార్టీలో ఎంజాయ్ చేస్తుంటే... దీనికి దూరంగా తన కుటుంబ సభ్యులతో కలిసి ముంబైలో జరిగిన ఓ ప్రైవేట్ పార్టీలో పాల్గొన్నారు దీపిక పదుకొనె. దీంతో వీరిద్ధరి మధ్య ఏదో జరుగుతోందని పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే రణ్‌వీర్ ఫ్యాన్స్ మాత్రం అలాంటిదేమీ లేదని.. దీపిక పలు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉండటం వల్లే స్పందించలేదని అంటున్నారు. ఈ వివాదానికి తెరపడాలంటే దీపిక స్పందించాల్సిందే.


Click it and Unblock the Notifications


















