ఇలియానా..రామ్ గోపాల్ వర్మని కలవటం వెనక?
రీసెంట్ గా గోవా ముద్దు గుమ్మ ఇలియానా...ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మని కలిసింది. ఈ విశేషాన్ని ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేసింది. ఆమె ట్వీట్ చేసిందేమిటంటే...నేను నిన్న(శనివారం) రామ్ గోపాల్ వర్మని కలిసాను..జనాలు అనుకున్నట్లుగా ఆయన కనపడలేదు. ఆయన చాలా నైస్ పర్శన్. అలాగే గొప్ప సెన్సాఫ్ హ్యూమర్ ఉన్న వ్యక్తి...ఇక ఇది చదివి ఏ కంక్లూజన్ కీ రాకండి. నేనేమీ రామ్ గోపాల్ వర్మతో ఏ చిత్రమూ చేయటం లేదని అది. ఇక ఇలియానాని రామ్ గోపాల్ వర్మ దగ్గరకి తీసుకువచ్చి పరిచయం చేసింది పూరీ జగన్నాధ్ అని తెలిసింది. పూరీ జగన్నాధ్ ప్రస్తుతం నేను...నా రాక్షసి అనే చిత్రం చేస్తున్నారు. అందులో ఇలియానా, రాణా జంటగా చేస్తున్నారు. ఇక రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా పూరీ దర్సకత్వంలో ది బిజెనెస్ మెన్ అనే చిత్రం త్వరలో రూపొందనుంది. అందులో హీరోగా సూర్య చేస్తున్నారు. హీరోయిన్ గా ఇలియానాని సజెష్ట్ చేయటానికే ఈ రామ్ గోపాల్ వర్మతో కలవటం అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











