»   » షాక్ : సన్నిలియోన్ కూడా రిజెక్టు చేసేటంత బూతుందా?

షాక్ : సన్నిలియోన్ కూడా రిజెక్టు చేసేటంత బూతుందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : కంటెంట్ లో బూతు ఉందని సినిమాని రిజెక్ట్ చేసిందా సన్ని లియోన్...అంటే అవుననే అంటున్నారు బాలీవుడ్ వాసులు. సన్నిలియోన్ ఏంటి బూతు ఉందని రిజిక్ట్ చేయటమేంటని ఆశ్చర్యపోతున్నారు. అదీ ఏక్తా కపూర్ లాంటి పెద్ద నిర్మాత ప్రాజెక్టు అంటే ఆశ్చర్యమే. ఇంతకీ ఆ ప్రాజెక్టు ఏమిటీ అంటే...ఆమె ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందిస్తున్న XXX చిత్రం.

ఈ చిత్రంలో మొదట సన్నిలియోన్ ని అడిగితే ఆమె వెంటనే మరో ఆలోచన లేకుండా నో చెప్పింది అంటున్నారు. అయితే అందులో మితిమీరిన న్యూడిటీ ఉంది కాబట్టే నో చెప్పారంటున్నారు. అయితే బాలీవుడ్ కొందరి వెర్షన్ మరో విధంగా ఉంది. సన్నిలియోన్ ..ఈ సినిమా కోసం ఐదు కోట్లు డిమాండ్ చేసిందని ఏక్తాకపూర్ అంత సీన్ లేదని నో చెప్పిందని అంటున్నారు. నిజా నిజాలు ఎలా ఉన్నా...సన్నిలియన్..రిజెక్ట్ చేసిందనే వార్త బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యి కూర్చుంది.

 Why did Sunny reject XXX movie

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

బాలీవుడ్ యంగ్ లేడీ ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ 'XXX' పేరుతో సెక్స్ ప్రధాన మైన బూతు సినిమాను తీయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ఫోటోలు శృంగార ప్రియులకు చుక్కలు చూపించాయి.

‘కామసూత్ర' ఆధారంగా తెరకెక్కబోయే ఈ చిత్రంలో కొత్త హీరోయిన్ నటించబోతోంది. సినిమాలో ఉండే ఘాటైన సెక్స్ సీన్లలో నటించడానికి రెగ్యులర్ హీరోయిన్లు ఒప్పుకోరని ముందే ఊహించిన ఏక్తా కపూర్ ఆ పాత్రకు సరిపోయే కొత్త భామ కోసం వెతుకుతోంది. ఇప్పటికీ ఈ సినిమాకు సరిపోయే హీరోయిన్ దొరకలేదట. శృతి మించిన శృంగార సీన్లు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదని టాక్. కొంత మంది వచ్చినా సినిమాకు సరిపడే స్థాయిలో లేరట.

వాలంటైన్ డే రోజు విడుదల చేసిన 'XXX' పోస్టర్స్, ఫస్ట్ లుక్ చూసిన వారు షాక్ అవుతున్నారు. ఈ చిత్రం ద్వారా కొత్త వారిని పరిచయం చేస్తానని చెప్తూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా కాస్టింగ్ కాల్ ఇచ్చింది. కెన్ ఘోష్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం బాలాజీ మోషన్ పిక్చర్స్ పతాకంపై రూపొందనుంది.

ఏక్తకపూర్ కు మొదటి నుంచి ఏటికి ఎదురీదటం అలవాటే..లేడి ప్రొడ్యూసర్ ఇలాంటివి చేస్తుందని ఎవరూ ఊహించరు. ఈ చిత్రానికి భారీ నిర్మాణ విలువలతో తీయనున్నట్లు చెప్తున్నారు. ఈ సినిమాలో శృతి మించిన శృంగార సన్నివేశాలు ఉండే అవకాసం ఉందంటున్నారు. దర్శకుడు గతంలో ఇష్క్ విష్క్ అంటూ చిత్రం డైరక్ట్ చేసిన కెన్ ఘోష్. ఈ చిత్రంలో రెగ్యులర్ బాలీవుడ్ నటులు కాకుండా కొత్త ఆర్టిస్టులను ప్రకటన ఇచ్చి మరీ ఎంపిక చేసారు. నో హార్డ్ ఫీలింగ్స్ అంటూ బూతుతో వస్తున్న ఈ చిత్రం రిలీజయ్యాక ఎన్ని సమస్యలు ఎదుర్కోబోతోందో అంటున్నారు.

English summary
Indo Canadian porn star Sunny sometime back shocked everyone by rejecting to star in Ekta Kapoor's upcoming erotic entertainer XXX.
Please Wait while comments are loading...