గుర్రం వల్లే ‘గబ్బర్ సింగ్’ సెన్సార్ లేటు?
పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' చిత్రం సెన్సార్ నిన్న(మే 7) పూర్తి కావాల్సి ఉంది. అయితే కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల ఈ రోజు సెన్సార్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఏమిటా టెక్నికల్ రీజన్స్ అనేది అందరిలో ఆసక్తి నెలకొంది. తెలిసిన సమాచారం ప్రకారం నిన్ననే డిజిటెల్ ప్రింట్ ని సెన్సార్ మెంబర్స్ చూడటం జరిగింది. U/A సర్టిఫికేట్ తో సెన్సార్ క్లియరెన్స్ ఇవ్వటానకి రెడీ అయ్యారు. అయితే ఓ టెక్నికల్ అబ్జెక్షన్ తో సెన్సార్ సర్టిఫికేట్ ఆగింది. అదీ గబ్బర్ సింగ్ లో వాడిన గుర్రం వల్ల అని తెలుస్తోంది.
ఇందులో పవన్ కళ్యాణ్ వాడిన గుర్రం సీన్స్ కి సెన్సార్ వారు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని తెచ్చుకోమన్నారు. హార్స్ రైడింగ్ ఏమిమల్ ప్రొడక్షన్స్ ని ఆ సర్టిఫికేట్ ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. నిర్మాతలు ఆ సర్టిఫికేట్ సబ్ మిట్ చేసిన వెంటనే జ్యూరీ మెంబర్స్ సెన్సార్ ఇష్యూ చేసేస్తారు. సెన్సార్ సర్టిఫికేట్ ఇష్యూ చేసిన తర్వాత మాత్రమే నిర్మాత చిత్రం రిలీజ్ డేట్ ని ప్రకటించాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ జరగటానకి పట్టిన టైమ్ వల్ల మాత్రమే సెన్సార్ లేటు అని తెలిసింది.
బండ్ల గణేష్ తమ చిత్రం మే 11న గ్రాండ్ గా విడుదల అవుతుందని సెన్సార్ ఫార్మాలీస్ అనంతరం ప్రకటించారు. అయితే మధ్యలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ ఆఫీసర్స్ అశోశియేషన్ వారు పవన్ పోలీస్ డ్రస్ వేసుకుని అమ్మాయిలతో డాన్స్ వేసే సీన్స్ తొలిగించాలని కోరారు. వారు డిమాండ్ మేరకు ఆ సీన్స్ తీసేసినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ సరసన శృతి హాసన్ నటిస్తుండగా.. మలైకా అరోరా, అభిమన్యు సింగ్, కోట శ్రీనివాసరావు, సుహాసిని, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, అజయ్, నాగినీడు, రావు రమేష్, గిరి, ఫిష్ వెంకట్, ప్రభాస్ శ్రీను, అలీ, సత్యం రాజేష్, మాస్టర్ ఆకాష్, మాస్టర్ నాగన్, ప్రవీణ్, మర్ల శ్రీను, కాభీభట్ల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటో గ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఎడిటింగ్: గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగేశ్న సతీష్, డాన్స్: దినేష్, గణేష్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్.


Click it and Unblock the Notifications











