గోపీచంద్ ఇంట్లో గొడవైందా?
అనూష్క గురించి గోపీచంద్ ఇంట్లో గొడవ జరిగినట్లు సమాచారం. లక్ష్యం, శౌర్యం చిత్రాలనుండీ అనూష్కకీ గోపీచంద్ కీ మధ్య ఏదో ఉందంటూ వినపడుతోంది. అయితే ఇద్దరూ విడివిడిగా ఖండిస్తూ నే వస్తున్నారు. అయితే ఆర్.ఆర్.మూవీ మేకర్స్ వారు ఈ కాంబినేషన్లో సినిమా చేయమన్నప్పుడు మాత్రం ఆనందంతో ఒప్పుకున్నాడు గోపీచంద్. అయితే ఇప్పటికే పత్రికల్లో, బయిటా వీరి అనుబంధాన్ని గురించి చర్చించుకోవటంతో అభ్యంతరం చెప్పారుట. మరో ప్రక్క అనూష్క మాత్రమే కాక హీరోయిన్స్ ఎవరూ కూడా ఇంటికి రాకూడదని ఆంక్ష పెట్టారుట. దాంతో చాలా ఇబ్బంది పడుతున్నాడుట గోపీచంద్. ఇప్పుడేమో ఏకంగా తమ ప్రక్కన ఫలానా వారు చేయకూడదని రూల్ పెట్టడం నచ్చటం లేదని చెప్పాడుటు. ఆ సినిమా చేస్తానని పట్టుపట్టాడట. అయితే ఇంట్లో పెద్దలు పట్టుపట్టడంతో వారి మనసలును బాధపెట్టడం ఇష్టంలేక నిర్మాతకు ఫోన్ చేసి డేట్స్ ఎడ్జెష్ట్ చేయలేమని చెప్పాడుట. దాంతో వారు రవితేజనే తీసుకున్నారు. డాన్ శీను పేరుతో తయారవుతున్న ఈ చిత్రానికి కోనవెంకట్ కథ,మాటలు అందిస్తున్నాడు. మలినేని గోపీచంద్ దర్శకుడుగా పరిచయమవుతున్నాడు.


Click it and Unblock the Notifications











