సమంత దెబ్బకే ఇలియానా డిస్కౌంట్ ఆఫర్?
అన్ని వైపుల నుంచీ భారీ స్ధాయిలో పోటి ఎదుర్కొంటున్న ఇలియానా...కోల్పోతున్న డిమాండ్ ని పెంచుకునే క్రమంలో డిస్కౌంట్ ప్యాకేజీ ని ప్రకటిస్తోందని తెలుస్తోంది. ఈ మేరకు ఆమె తనతో పనిచేసిన, చేద్దామని ఆశపడుతున్న నిర్మాతలుకు మెసేజ్ లుపాస్ చేస్తోందని చెప్తున్నారు. ముఖ్యంగా సమంత దూసుకుపోవటం ఆమెకు మింగుడుపడటం లేదంటున్నారు. కిక్ తప్ప రీసెంట్ గా ఆమెకు హిట్టులు లేవని, సలీం, రెచ్చిపో భాక్సీఫీస్ వద్ద డిజాస్టర్ ఫలితాన్ని చవిచూడటం ఆమె డిమాండ్ ని తగ్గించింది. మరో ప్రక్క ఊహించని విధంగా అనూష్క..అరుంధతితో క్లిక్ అయి పెద్ద పెద్ద ఆఫర్స్ చేజిక్కుంచుకుని దూసుకుపోతోంది. కాజల్..మగధీర తర్వాత ఇలియానా ని ఎంకరేజ్ చేసే హీరోలను ఆకట్టుకుని సెటిల్ అయ్యే ప్రయత్నాల్లో ఉంది. దాంతో ఎటుచూసినా కలిసి వచ్చే వాతావరణం కనపడకపోవటంతో ఈ నిర్ణయం తీసుకుందంటున్నరు. రెండు హిట్స్ చేతిలో ఉంటే అప్పుడు మళ్ళీ డిమాండ్ చేయవచ్చని ఇలియానా భావిస్తోంది. కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్ళు ఆమె డిస్కౌంట్ ఆఫర్ ని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం ఇలియానా ఎన్టీఆర్ సరసన శక్తిలోనూ, పవన్ కళ్యాణ్ సరసన లవ్ ఆజ్ కల్ రీమేక్ చేస్తోంది.


Click it and Unblock the Notifications











