twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బిజినెస్ మ్యాన్' రిలీజ్ వాయిదా కారణం?

    By Srikanya
    |

    మహేష్ తాజా చిత్రం బిజినెస్ మ్యాన్ మొదట అనుకున్న దానికి రెండు రోజులు ముందుకు జరిపి జనవరి 13న విడుదల చేయనున్నారనే సంగతి తెలిసిందే. దీనికి కారణమంటూ ఓ రూమర్ సినీ సర్కిల్సో మొదలైంది. సినిమాలో కామిడీ తక్కువైందని నిర్మాతలు ప్రెజర్ పెట్టడమేనని చెప్పుకుంటున్నారు. దూకుడులో ఉన్నంత కామిడీ లేకపోయినా అందులో కొంతైనా ఉండాలని పట్టుబట్టి నిర్మాతలు మళ్లీ కొన్ని కామిడీ సీన్స్ ని పూరి చేత షూట్ చేయిస్తున్నారని చెప్పుకుంటున్నారు. అలీ,బ్రహ్మానందంను కలుపుతూ ఈ ట్రాక్ అల్లాడని అది కలిపి సినిమాని విడుదల చేద్దామనే ఆలోచన చేస్తున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే సెన్సార్ అయ్యిపోయినా సినిమా విడుడల వాయిదా వెళ్లాల్సి వస్తోందని టాక్ వినపడుతోంది. అయితే అటువంటిదేమీ లేదు టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న సమస్యలు వల్లే సినిమా రిలీజ్ ను రెండు రోజులు ముందుకు జరపాల్సి వచ్చిందని కొందరంటున్నారు. ఇప్పుడు కొత్తగా కామిడీ ట్రాక్ షూట్ చేస్తే మాత్రం కలిపితే సెన్సార్ క్లియరెన్స్ ఎట్లా తెస్తారని వారు ప్రశ్నిస్తున్నారు.

    ఇక మరో ప్రక్క చిత్రంలో ధర్మవరపు కామిడీ హైలెట్ గా ఉండబోతోందని టాక్ వినిపిస్తోంది. ఇక ఈ చిత్రం ని జనవరి 11న విడుదల ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఫోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో లేట్ అవ్వటం వలన రిలీజ్ డేట్ వాయిదా వేస్తున్నారు. మొదట అనుకున్న దానికి రెండు రోజులు ముందుకు జరిపి జనవరి 13న విడుదల చేయనున్నారు. తమిళ వెర్షన్ ని జనవరి 26న విడుదల చేస్తారు. మళయాళ వెర్షన్ విడుదల కు ఇంకా విడుదల తేది ఫిక్స్ కాలేదు. దూకుడు చిత్రం ఓవర్ సీస్ మార్కెట్లో చేసిన బిజినెస్ ని దృష్టిలో పెట్టుకుని ఈ సారి భారి ఎత్తున విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం ఆడియో మంచి క్రేజ్ సంపాదించుకుని మార్కెట్లో సినిమాపై అంచనాలు పెంచుతోంది.ఈ చిత్రాన్ని ఓవర్ సీస్ లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో స్క్రీన్ చేయనున్నారు. ఓవర్ సీస్ లో సెటిలైన తెలుగువారు కాని మహేష్ బాబు ఫ్యాన్స్ కోసం ఈ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే మొట్టమొదటి సబ్ టైటిల్స్ తో వస్తున్న తెలుగు చిత్రం కావటం మరో రికార్డుగా అభివర్ణిస్తున్నారు.

    English summary
    It is learnt that, producers have put pressure on Puri for picturizing a separate track. Same the Businessman release is delayed.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X