Raja Saab : ‘రాజా సాబ్’ ఆలస్యం అందుకే? ఇంతకీ ఏం చేస్తున్నారో తెలుసా!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఎంత పెద్ద ప్రాజెక్ట్స్ ను డీల్ చేస్తున్నారో తెలిసింది. పాన్ ఇండియన్ స్టార్ గా ఎదిగిన తర్వాత డార్లింగ్ తీరిక లేకుండా షూటింగ్స్ తోనే సమయం గడుపుతున్నారు. అయితే బాహుబలి.. తర్వాత నుంచి ప్రభాస్ ఏ సినిమా చేసిన బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేయాల్సిందేనని ఓ టార్గెట్ కూడా ఏర్పడింది. దీంతో ప్రభాస్ అప్ కమింగ్ ఫిలిమ్స్ పై అభిమానుల్లోనే కాకుండా నార్మల్ ఆడియన్స్ లోనూ ఎంతో ఆసక్తి నెలకొంది. నెక్స్ట్ ఏ ఫిలిం వస్తుందా అని ఎంతో ఆశ గా ఎదురు చూస్తున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. భారీ కంటెంట్, భారీ బడ్జెట్, భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ప్రభాస్ సినిమాలు తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక చివరిగా డార్లింగ్ సలార్, కల్కి 2898 ఏడీ చిత్రాలతో ఎంత పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసారో చూసాం. ఇక కల్కి చిత్రం ఏకంగా 1100 కోట్ల రూపాయల వసూళ్లను సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద అదరగొట్టింది. ఈ క్రమంలో ప్రభాస్ నుంచి రాబోయే చిత్రంపై అతిభారీ అంచనాలు ఉన్నాయి.

Why is Prabhas Raja Saab movie delaying too much Here s the reason

నెక్స్ట్ ప్రభాస్ నుంచి లవ్ స్టోరీల దర్శకుడు మారుతీ డైరెక్ట్ చేసిన ' రాజా సాబ్' చిత్రం రానుంది. అయితే ఇప్పటికే సినిమా ప్రేక్షకులకు ముందుకు రావాల్సి ఉంది. కానీ ఇంకా టీజర్ కూడా రిలీజ్ చేయలేదు. అసలు ఇంత ఆలస్యం ఎందుకు అవుతుందా అని అభిమానులు, ఆడియన్స్ సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. ఆ వార్త మేరకే రాజా సాబ్ చిత్రం డిలే అవుతూ వస్తుందని తెలుస్తోంది.

ఈ క్రైం అండ్ కామెడీ జోనర్ లో వస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయబోతున్నారని తెలుస్తుంది. గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ సన్ పాత్రలతో అభిమానులను అలరించబోతున్నారని తెలుస్తుంది. ఇప్పటికే ఈ రెండు పాత్రలకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ పోస్టర్స్ విడుదలైన సంగతి తెలిసిందే. పోస్టర్స్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. సినిమాపై ఫ్యాన్స్ లోనే కాకుండా నార్మల్ ఆడియన్స్ లోను ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది. దీనితో రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ఆసక్తిగా మారింది.

Take a Poll

ప్రస్తుతం రాజా సాబ్ టీం 3 గంటల 50 నిమిషాల ఫుటేజీని ట్రిమ్ చేసే పనిలో నిమగ్నమై ఉన్నదని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ప్రభాస్ తన షూటింగ్ పార్టీ ని ఎప్పుడో కంప్లీట్ చేశాడని అర్థమవుతుంది. ఇక కొద్ది రోజుల్లోనే ఓ రన్ టైం లో ఫుటేజీని ఎంత సెట్ చేసి ఆ తర్వాత నుంచి ప్రమోషన్స్ ను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ సరసన మాళవికా మోహనన్ నటిస్తోందని సమాచారం. ఇక ఈ చిత్రం నుంచి ఎప్పుడెప్పుడు ఎలాంటి అప్డేట్ రానున్నదనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఇదిలా ఉంటే... ప్రభాస్ తన రాబోయే చిత్రాలైన fauji, స్పిరిట్, కన్నప్ప, సలార్ 2, కల్కి2, లోకేష్ కనగరాజుతో మరో సినిమా చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు.

More from Filmibeat

Read more about: rajasaab prabhas
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X