»   » తరచూ ఆసుపత్రికి...ఆ హీరోయిన్ గర్భవతైందా?

తరచూ ఆసుపత్రికి...ఆ హీరోయిన్ గర్భవతైందా?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Why Is Vidya Balan Visiting Hospital Regularly?
హైదరాబాద్: యూటీవీ హెడ్ సిద్ధార్థ్ రాయ్ కపూర్‌ను ఇటీవల పెళ్లాడిన బాలీవుడ్ బ్యూటీ విద్యా బాలన్ ఈ మధ్య తరచూ ఆసుపత్రికి వెలుతోంది. ముంబైలోని అంధేరి ప్రాంతంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి విద్యా బాలన్ ఈ మధ్య క్రమం తప్పకుండా వస్తుండటం పలు అనుమానాలకు దారి తీస్తోంది.

గత కొన్ని వారాలుగా విద్యా బాలన్ తరచూ ఈ ఆసుపత్రిని సందర్శిస్తోందని కొందరు మీడియాకు సమాచారం అందించారు. ఆమె ఆసుపత్రికి వస్తున్న సమయంలో కుటుంబ సభ్యులు కూడా ఉంటున్నారట. అయితే ఆమె ఎందుకు ఆసుపత్రికి వస్తుందనే విషయాలను వెల్లడించడానికి ఆసుపత్రి వర్గాలు నిరాకరిస్తున్నాయి.

అయితే కొందరు మాత్రం ఆమె గర్భవతి అయిఉంటుందనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి విద్యా నిజంగానే గర్భవతి అయిందా? లేక ఇంకేమైనా ఆరోగ్య పరైమన కారణాలు ఉన్నాయా అనేది అఫీషియల్‌గా తేలాల్సి ఉంది. ఏ విషయమైనా ఎంతో కాలం దాగదు అనేది వాస్తవం.

ఇటీవల విద్యాబాలన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ....మరో రెండేళ్ల తర్వాతే పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటామని వెల్లడించారు. 2013 సంవత్సరంలో విద్యాబాలన్ నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఆ సంవత్సరం అంతా పలు చిత్రాలు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. ఆమె నటిస్తున్న షాది కి సైడ్ ఎఫెక్ట్స్, బాబీ జాసోస్, హమారీ ఆధురి కహానీ చిత్రాలు ఈ సంవత్సరం విడుదల కానున్నాయి.

English summary
Vidya Balan, who recently married UTV Head Siddharth Roy Kapur is said to be visiting a renowned specialty hospital in Andheri, Mumbai quite frequently for reasons unknown.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu