వైవిఎస్...బాలయ్య ‘సీఎం’ ఎందుకు చేయడం లేదు?
బాలయ్య హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో 'సీఎం'(కామన్ మేన్) చిత్రం రూపొందుతోందని, బొమ్మరిల్లు వారి సినిమా బ్యానర్‌పై వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు కొంత కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అందరినీ విస్మయానికి గురి చేస్తూ...తనకు, తన బ్యానర్‌కు ఆ సినిమాతో సంబంధం లేదని, తాను బాలయ్యతో సినిమా చేయడం లేదని నిన్న ప్రెస్ స్టేట్ మెంట్ ఇచ్చారు వైవిఎస్.
నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లు...వైవిఎస్‌కు ఆ సినిమాతో సంబంధం లేకుంటే మీడియాలో, టీవీ చానళ్లలో వార్తలు ఎలా వచ్చాయి? అనే అనుమానాలు వెల్లు వెత్తుతున్నాయి. వైవిఎస్ ఈ సినిమా ప్రాజెక్టు నుంచి కావాలని తప్పుకున్నారనే పుకార్లు కూడా వినిపిస్తున్నాయి. రవితేజ హీరోగా వైవిఎస్ నిర్మించిన 'నిప్పు' ఇటీవల విడుదలై ప్లాపవడం కూడా ఇందుకు ఓకారణం అంటున్నారు.
గతంలో బాలయ్యతో 'ఒక్క మగాడు' చిత్రాన్ని నిర్మించిన వైవిఎస్ ఆ తర్వాత అన్నీ పరాజయాలే చవి చూశాడు. 'నిప్పు' సినిమా విడుదలకు ముందు బాలయ్యతో 'సీఎం' సినిమా సూచన ప్రాయంగా అనుకున్నప్పటికీ 'నిప్పు' డిజాస్టర్‌తో ఆ ప్రయత్నాన్ని విమరించుకున్నారని అంటున్నారు. అయితే మీడియాతో మాత్రం ఆ సినిమాకు తానే నిర్మాత అని ప్రచారం సాగుతుండటంతో ప్రెస్ నోట్ ఇచ్చి ఖండించారనే వార్తలు వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











