పవన్ కళ్యాణ్ పై అలిగిన ‘తీన్ మార్’ డైరెక్టర్
సినిమా రైటరు గొప్పా? లేక డైరెక్టరు గొప్పా? అంటే మామూలుగా డైరెక్టరే అని చెబుతాం. అయితే, ఇప్పుడిది 'తీన్ మార్" సినిమా విషయంలో రివర్స్ అయింది. ఈ సినిమాకి డైలాగులు రాసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కి డైరెక్టరు జయంత్ కన్నా ఎక్కువ రెమ్యునేరేషన్ ఇవ్వడంతో చిన్న గొడవ కూడా స్టార్ట్ అయి, అది దర్శకుని ఈగో మీద దెబ్బ కొట్టిందట.
'తీన్ మార్' సినిమా హిట్ అయిందంటూ పవన్ కల్యాణ్ నుంచీ, ఆఫీస్ బాయ్ వరకు ఆ సినిమాకి పనిచేసిన వాళ్లంతా హ్యాపీగా సంబరాలు చేసుకుంటుంటే, దర్శకుడు జయంత్ మాత్రం నిర్మాత మీద అలిగి, ఆ సంబరాలకు దూరంగా ఉన్నాడట. అసలు సినిమాలు లేక, సక్సెస్ అసలే లేక ఖాళీగా వున్న దర్శకుడు జయంత్ కి ఈ సినిమా మరో లైఫ్ నిచ్చింది. కాబట్టి ఆయన ఇంకా హ్యాపీగానే వుండాలి కదా?
అయితే, జయంత్ అలా అలగడానికి అసలు కారణం ఏమిటంటే, ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన డైలాగులు బాగా ప్లస్ అయ్యాయనీ, సినిమా సక్సెస్ క్రెడిట్ నంతా ఆయనకే ఇచ్చేస్తున్నారు. దానికి తోడు జయంత్ కన్నా త్రివిక్రమ్ కే ఎక్కువ పారితోషికం ఇచ్చారట. ఈ సినిమాకి మాటలు రాసినందుకు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి రెండు కోట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. చెప్పిన సమయం కన్నా ముందుగానే రాసివ్వడమే కాకుండా, అద్భుతమైన డైలాగులు రాశాడని పవన్ కళ్యాన్ త్రివిక్రమ్ కి కితాబు కూడా ఇచ్చాడట. దాంతో జయంత్ ప్రస్తుతం నిర్మాత, పవన్ కల్యాణ్ లపై అలిగి, సినిమా ప్రమోషన్ కి దూరంగా ఉంటున్నాడని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications










