ఎన్టీఆర్ 'అదుర్స్'సంక్రాంతికి రాని కారణం?
జూ ఎన్టీఆర్, వి.వి.వినాయిక్ కాంబినేషన్లో రూపొందుతున్న అదుర్స్ సంక్రాంతికి రిలీజు చేయటం లేదన్న సంగతి తెలిసిందే. దీనికి కారణం జూ ఎన్టీఆర్ గతంలో చేసిన ఆంధ్రావాలా, నాగ, నా అల్లుడు చిత్రాలు సంక్రాంతికి రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకోవటమేనని అంటున్నారు. దాంతో జూ ఎన్టీఆర్ కు సంక్రాంతి సెంటిమెంట్ అచ్చిరాదని నిర్ణయించుకుని ముందుగా డిసెంబర్ 18న రిలీజ్ చేయటానికి నిర్ణయించినట్లు చెప్తున్నారు. ఇక ఈ చిత్రానికి రకరకాల టైటిల్స్ అనుకుని చివరకు అదుర్స్ టైటిల్ ని కన్ఫర్మ్ చేసారు. ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ గా తయారవుతున్న ఈ చిత్రంలో నయనతార, షీలా హీరోయిన్స్ గా చేస్తున్నారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తూంటే..ఛోటా కె నాయుడు కెమెరా అందిస్తున్నాడు. స్టన్ శివ ఫైట్స్ కంపోజ్ చేస్తున్నాడు. కొడాలి నాని సమర్ఫిస్తున్న ఈ చిత్రానికి వల్లభనేని వంశిమోహన్ నిర్మిస్తున్నాడు. ఇక అదుర్స్ అనే టైటిల్ కి ఇప్పటికే పరిశ్రమ వర్గాల నుండి మంచి స్పందన వస్తోంది. ఆది, సాంబ చిత్రాల తర్వాత వి.వి.వినాయిక్, జూ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావటంతో అభిమానుల్లోనూ మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. 9వ తేదీ నుంచి హైదరాబాద్ లో ఓ పాటని చిత్రీకరిస్తారు. దీని కోసం ప్రత్యేకంగా పబ్ సెట్‌ని తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల రెండవ వారంలో పాటల్ని విడుదల చేస్తారు.


Click it and Unblock the Notifications











