twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నాగార్జునపై మండిపడుతున్న కాజల్

    By Srikanya
    |

    ప్రస్తుతం కాజల్ కి మహేష్,పూరీ కాంబినేషన్ లో రూపొందుతున్న ది బిజినెస్ మ్యాన్ లో తప్ప కొత్త ఆఫర్స్ ఏమీ లేవు.దాంతో ఆమె డైలమోలో పడింది. వరస ఫెయిల్యూర్స్ ఆమెను ఇబ్బందుల్లో పడేసాయి. ముఖ్యంగా దడ చిత్రం ఆమె కెరీర్ ని బాగా దెబ్బ కొట్టింది. దడ చిత్రం టైమ్ లో ఆమె నాగచైతన్య ను చిన్న చూపు చూసిందని, అప్పుడు నాగార్జున కలగచేసుకోవటం జరిగింది. అయితే దడ చిత్రం టైమ్ లో ఆమెకు నాగార్జున తన కుమారుడుతో చేసే తదుపరి చిత్రంలోనూ ఆఫర్ ఇస్తాననే ఆ సినిమా ఒప్పించాడని తెలుస్తోంది.అయితే దడ సినిమానే ఫ్లాప్ అవటంతో అస్సలు కాజల్ వైపే చూడటం మానేసారు. అంతగా కాకపోతే తన ప్రక్కన ఆఫర్ ఇవ్వటానికి నాగార్జున ఆసక్తి చూపుతున్నాట్ట కానీ నాగచైతన్య ప్రక్కన అంటే నో అని చెప్పేస్తున్నాడు.

    ఈ నేపధ్యంలో ఆమె నాగార్జునని ఏమీ అనలేక తన సన్నిహితుల వద్ద చెప్పుకుని భాధపడుతోందని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక మరో ప్రక్క సమంత హవా దూకుడుతో మొదలైంది. దాంతో అందరూ ఆమె అవకాశాలను సమంతా కొట్టుకెళ్లిందని అంటున్నారు. దానకి ఆమె మాట్లాడుతూ... ఎదుటివారు నాశనం అవ్వాలని కోరుకోవడం మాత్రం నా దృష్టిలో చాలాతప్పు. సాటి హీరోయిన్‌కి మంచి కేరక్టర్ లభిస్తే... దాన్ని చూసి కుళ్లుకోవడం చేతకాని వాళ్లు చేసే పని. ఫలానా పాత్ర నాకు కావాలి అనగానే... వెతుక్కుంటూ ఆ పాత్ర మనదగ్గరకు వచ్చేయదు. ఆ పాత్రకు ఎవరు కరెక్ట్ అనేది డెరైక్టర్ ఆలోచనపై ఆధారపడి ఉంటుంది అంటోంది కాజల్. అలాగే నా ఆదృష్టం బావుండి లక్ష్మీకళ్యాణం నుంచి నాకు మంచి పాత్రలే వచ్చాయి అంది.

    English summary
    Kajal Agarwal said, "I am currently shooting with Puri Jagannath's The Businessman in Telugu with Mahesh Babu (actor). I've received loads of offers in Hindi. But I haven't zeroed in on any."
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X