'గమ్యం' పనోరమాకి నచ్చని కారణం?

అలాగే 'గమ్యం' సినిమా పనోరమాకు ఎంపిక కాకపోవటం పై కూడా రెడ్డి గారి పాత్ర ఉందంటూ భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంలో ఏమి మాట్లాడినా పనోరమా కమిటీ నిర్ణయాన్ని తప్పు పట్టినట్లు అవుతుంది. నిజమైన సినిమాకు ప్రేక్షకాదారణ,వారి మెచ్చుకోలు అవార్డ్స్ వంటివనేది అందరికీ ముఖ్యంగా సినిమా వారికి బాగా తెలిసిన విషయమే.అయితే 'గమ్యం' సినిమా ఆస్కార్ ఎంట్రీకి ఎన్నికచేసే ఇండియన్ సినిమాల్లో ఒకటిగా నిలిచిన విషయం గమనార్హం.
ఇక తన సినిమాలో కమర్షియల్ విలువలు లేవనీ,హీరోయిన్ అర్ధ నగ్న దృశ్యాలు లేవనీ శాటిలైట్ రైట్స్ తీసుకోవటానికి కొన్ని ఛానెల్స్ వారు ముందుకు రాలేదని ఈ సందర్బంగా అనటం అంతటా చర్చనీయాంశంగా మారింది.అయితే టీవీ ఛానెల్స్ వారు తమ టీఆర్ పీ రేటింగ్స్ ఈ సినిమా ద్వారా పెరిగితే తద్వారా వచ్చే లాభం కోసం సినిమాలు కొనుగోలు చేస్తారు గానీ..దేశ సేవ కోసం కొనరనే సత్యం సి.సి.రెడ్డి గారికి తెలియంది కాదనీ అంటున్నారు. ఇక 'శ్రేయాభిలాషి' చిత్రాన్ని ఇండియన్ పనోరమా సెక్షన్ క్రింద వచ్చే నెల గోవాలో IFFI లో ప్రదర్శస్తారు.


Click it and Unblock the Notifications











