కృష్ణవంశీ ఎందుకని రిచా గంగోపాధ్యాయని రిజెక్టు చేసాడంటే...

By Srikanya

కృష్ణవంశీ, గోపీచంద్ కాంబినేషన్ లో నల్లమలుపు బుజ్జి రూపొందింస్తున్న మొగుడు చిత్రంలో హీరోయిన్ గా మొదట'లీడర్" చిత్రంతో పరిచయమైన రిచా గంగోపాధ్యాయని అడిగారు. అయితే తనకు పూర్తి కథ వినిపించమని, తన పాత్ర ఆ కథలో ఎంత ప్రాధాన్యత కలిగి ఉందో చెప్పమని రకరకాల రూల్స్ పెట్టిందిట. అంతేగాక అసలు నటించే ఆలోచన తర్వాత చెబుతానని, వారిని తిప్పించుకోవడంతో చివరికి విసుగెత్తిన దర్శకుడు ఆమె ధాటిని తట్టుకోలేక తాప్సీని తీసుకున్నాడట. దీంతో ఏం చేయాలో అర్దం కాని రిచా మళ్లీ కాళ్ల బేరానికి వచ్చింది. దాంతో ఆ దర్శకుడు ఈ పాత్రకు సరైన ప్రాధాన్యత లేదు. అందుకే వేరే హీరోయిన్‌ని తీసుకున్నానని చెప్పాట్ట.ఏం చేయాలో అర్దం కాని సిట్యువేషన్ లో తన తొలి హీరో రానా తో చెప్పించే ప్రయత్నం చేసిందిట. ఇక ఆమెను చూసి ముందుకు వెళ్ళిన వారిని సరైన నిర్ణయాలు తీసుకోలేక నిర్మాతలను, దర్శకులను ఇబ్బంది పెడుతోందని చెప్తున్నారు. రెండు మూడు చిత్రాల్లో నటించినంత మాత్రాన సరైన హిట్లు లేకపోయినా, నిర్మాత, దర్శకులకు సరికొత్త రూల్స్ పెడుతోందని, ముందు తన శరీరంపై కంట్రోల్ లేకపోవడం కూడా మరో కారణంగా ఆమెకు అవకాశాలు దొరకడం లేదని చెప్పుకుంటున్నారు. అలాగే ఈ చిత్రంలో కాజల్ గెస్ట్ రోల్ చేస్తోంది .సాక్షి గులాటి(అప్పలరాజు ఫేం) మరో హీరోయిన్ గా చేస్తోంది. నల్లమలపు బుజ్జి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మొదలైంది. రీసెంట్ గా నల్లమలుపు బుజ్జి..నేను నా రాక్షసి చిత్రాన్ని పూరీ జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందించారు. ఆ చిత్రం భాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ టాక్ వచ్చింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X