లక్ష్మీ ప్రసన్న మంచు ని వ్యాంప్ పాత్రకే...
మోహన్ బాబు కూతురుగా,నిర్మాతగా, నటిగా తనను తాను నిరూపించుకుంటూ దూసుకు వెళ్థోంది మంచు లక్ష్మీ ప్రసన్న. అలాగే రీసెంట్ గా కమల్ హాసన్ తన తాజా చిత్రం విశ్వరూపంలో లక్ష్మీ ప్రసన్న మంచుకు ఆఫర్ ఇస్తానంటే ఆమె రిజెక్టు చేసిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఆమె తనకు డేట్స్ ఖాళీ లేవని రిజెఆక్టు చేసింది. నిజానికి లక్ష్మి అంత బిజీగా ఏమి లేదు . ఆమె చేతిలో రామ్ గోపాల్ వర్మ తీస్తున్న డిపార్టమెంట్ చిత్రం తప్ప మరొకటి లేదు. అందులోనూ ఆమెది చిన్న పాత్రేనంటున్నారు.మరి ఎందుకు అంత పెద్ద స్టార్ అడిగితే కాదంటి అంటే దానికి కారణం ..కమల్ అడిగింది ఓ వ్యాంప్ పాత్రకు అని తెలుస్తోంది. లక్ష్మి స్టిల్స్ చూసిన ఆయన అలా ఫిక్స్ అయ్యాడట. అయితే దొంగలముఠా చూసిన వారు , అనగనగా ఓ యోధుడు చూసిన వారు ఆమెలో మంచి నెగిటివ్ షేడ్స్ ఉన్న నటి ఉందని ఒప్పుకుంటున్నారు. అయితే దానికి బిన్నంగా కమల్ ఆమెకు అలాంటి పాత్ర ఆఫర్ చెయ్యటంతో ఆమె షాక్ అయ్యిందని ఫిల్స్ సర్కిల్స్ లో వినపడుతోంది. ఇక ఆ పాత్ర దశావతారం చిత్రంలో మల్లికా షెరావత్ తరహా పాత్ర అని చెప్తున్నారు. అదీ అస్సలు మ్యాటర్.


Click it and Unblock the Notifications











