బెల్లంకొండను చూసి నవ్వుతున్న లారెన్స్
తన కాంచన చిత్రంతో డబ్బులు చేసుకున్న బెల్లంకొండ సురేష్ ని చూసి ఇప్పుడు లారెన్స్ నవ్వుతున్నాడు. దానికి కారణం బెల్లంకొండ రీసెంట్ గా తమిళ సూపర్ హిట్ మంగత్తాని డబ్బింగ్ చేసి గ్లాంబ్లర్ గా రలీజ్ చేయటం. ఆ చిత్రం వద్దని లారెన్స్ చెప్పినా వినకుండా బెల్లంకొండ డబ్ చేసాడని,అందుకే డిజాస్టర్ ఫలితం వచ్చిందని అంటున్నాట్ట లారెన్స్. అందరూ తనలాగ తమిళం,తెలుగు ఆడియన్స్ ఇద్దరినీ రంజింప చేసి హిట్టు కొట్టే సినిమాలు చేయలేరని, తనకు ప్రేక్షకులు పల్స్ తెలుసునని అది చూసుకోకుండా కాంచన హిట్ అయ్యిందని గాంబ్లర్ కొనటం గ్లాబ్లింగ్ చేయటమే అంటున్నాడని చెప్పుకుంటున్నారు. ఇక ప్రస్తుతం లారెన్స్ ...ప్రభాస్ తో రెబెల్ చిత్రం చేస్తున్నాడు. ఆ చిత్రాన్ని తమిళ రైట్స్ కావాలంటే ఇప్పిస్తానని బెల్లంకొండకు చెప్పినా వినకుండా ఇలా దెబ్బతిన్నాడని చెప్తున్నాడని వినపడుతోంది. ఇక రెబెల్ లో ప్రభాస్ సరసన తమన్నా, దీక్షాసేధ్ చేస్తున్నారు.అలాగే బెల్లంకొండ ప్రస్తుతం వెంకటేష్ తో బాడీగార్డు చిత్రం రీమేక్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











