'1 - నేనొక్కడినే' ఫ్లాఫ్ కాబట్టే మహేష్ ఈ నిర్ణయం

By Srikanya

Why Mahesh agree to work with Kortala Siva?
హైదరాబాద్: ఈ యేడాది '1 - నేనొక్కడినే' అంటూ పలకరించారు మహేష్‌బాబు. అయితే ఈ చిత్రం కొంతమంది పరిమితమైన మేధావుల చేత బాగుందనిపించినా,విపరీతమైన పబ్లిసిటీ చేసినా పెద్ద ఫ్లాఫు చిత్రంగా భాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా నమోదైంది. ఈ నేపధ్యంలో తన రాబోయే చిత్రాలను ఆయన ఆచితూచి మరీ ఎంచుకోదలుస్తున్నారని సమాచారం. ఆ నేపధ్యంలోనే కొరటాల శివ కథకు వెంటనే ఓకే చేసాడంటున్నారు.

సాధారణంగా మహేష్ బాబు లాంటి హీరో సినిమా ఎవరిని ఆకట్టుకోవాలి..మాస్ నా, క్లాస్ నా, ఇద్దరినా అంటే ఇద్దరినీ అనే సమాధానమొస్తుంది. అయితే '1 - నేనొక్కడినే' చిత్రం ఓ వర్గానికి దూరం అయ్యింది. మాస్ ప్రేక్షకులు నిర్విర్దంగా వద్దనేసారు. ఈ నేపధ్యంలో ఆయన తనకు మాస్ ని దూరం చేసుకోకూడదని నిర్ణయం తీసుకునే కొరటాల శివతో చేయటానికి ఆసక్తి చూపించి, వెంటనే డేట్స్ ఇస్తున్నాడంటున్నారు. అదే '1 - నేనొక్కడినే' హిట్ అయ్యి ఉంటే ఖచ్చితంగా మహేష్ తీసుకునే నిర్ణయాలు వేరుగా ఉండేవంటున్నారు.

ప్రస్తుతం మహేష్ 'ఆగడు' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈలోగా మరో సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేసుకొంటున్నారు. మహేష్‌బాబు - కొరటాల శివ కలయికలో ఓ చిత్రం రూపుదిద్దుకొంటుందని ఎప్పటి నుంచో అనుకొంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా బండి ముందుకు కదిలింది. కథ సిద్ధమైందని.. జులై నుంచి సెట్స్‌పైకి వెళ్తామని చిత్రబృందం ప్రకటించింది.

మహేష్ బాబు మాట్లాడుతూ....కొరటాల చెప్పిన కథ ఎంతో ఎక్సయిటింగ్ గా ఉంది. మా కాంబినేషన్ లో ఇది మంచి కమర్సియల్ ఫిలిం అవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ లో ఈ సినిమా రూపొందుతోంది అన్నారు.

దర్శకుడు మాట్లాడుతూ ''నా రెండో చిత్రమే మహేష్‌బాబుతో చేయబోతుండడం ఆనందంగా ఉంది. క్లాస్‌, మాస్‌ కలిపిన కథలో మహేష్‌ పాత్ర ఆకట్టుకొంటుంది. ఈ కథలో అన్ని రకాల వాణిజ్య హంగులూ ఉన్నాయి. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు దొరికారు.ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను నిర్మించడానికి ప్లాన్ చేశారు. యువతరం, కుటుంబం తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చుతుంది. మహేష్ బాబు అభిమానులు మెచ్చే చిత్రం అవుతుంది ''అన్నారు.

నిర్మాలు మాట్లాడుతూ... మా మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే తొలి చిత్రమే సూపర్ స్టార్ మహేష్ బాబు గారితో చెయ్యడం మా అదృష్టంగా భావిస్తున్నాము. మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎంతో భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నాము. రెగ్యులర్ షూటింగ్ జూలై నుండి ఉంటుంది అన్నారు.

మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శ్త్తకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనుంది. ఈ సినిమా జూలై నెలలో ప్రారంభం కానుంది. ఓవర్సీస్ లో అత్తారింటికి దారేది వంటి భారీ సినిమాలు పంపిణీ చేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్న మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి సంగీతం:దేవిశ్రీప్రసాద్,ఫోటోగ్రఫిః మది, ఫైట్స్: అరసు, ఎగ్జిక్యూటివ్ ప్రసాద్:అశోక్, నిర్మాతలుః ఎర్నేని నవీన్, యలమంచిలి రవిశంకర్, సివియమ్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X