కాజల్ ని ఖాతరు చేయని మహేష్ బాబు..!
టాప్ హీరోయిన్లు అయినా, కొత్త హీరోయిన్లు అయినా మహేష్ బాబు సరసన నటించాలని తపించి పోతుంటారు. అందగాడైన మహేష్ కి అమ్మాయిల్లో ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన పనిలేదు. అలాంటి మహేష్ సరసన నటించాలనేది కాజల్ చిరకాల వాంఛ. కానీ మహేష్ ఆమెకి అవకాశమివ్వడం లేదు. స్టార్ గా ఎదిగిన కాజల్ ని మిగతా యంగ్ హీరోలు ఏరికోరి తమ సినిమాల్లో పెట్టుకుంటూ ఉంటే మహేష్ మాత్రం ఎందుకో ఆమెవైపు కూడా చూడటం లేదు.
తన పోకిరి రికార్డులని కొట్టిన మగధీర సినిమాలో హీరోయిన్ అని తెలసినా కూడా మహేష్ కాజల్ ని ఖాతరు చేయడం లేదు. దరిదాపుల్లో వీరిద్దరూ కలిసి నటించే సినిమా ఉన్నట్టు ప్రకటనలు కూడా రావట్లేదు. కాజల్ ఇంకా టాప్ లో ఉండగానే హహేష్ ఆమె కోరికను తీరుస్తాడో?లేదో వేచి చూడాల్సిందే...


Click it and Unblock the Notifications











