మహేష్- UTV డీల్ కాన్సిల్ కారణం

కార్పోరేట్ సంస్ధలతో డీల్స్ అనేసరికి రకరకాల లెక్కలు, క్లాస్ లు ఉంటాయని, అవి సహజమని అంటున్నారు. రెగ్యులర్ గా ఇండిడ్యువల్ ప్రొడ్యూసర్స్ కు అలవాటుపడిన మన హీరోలు అన్ని కండీషన్స్ భరించాల్సిన అవసరం లేదని భావిస్తున్నారని, తమ డిమాండ్ మేరకే నిర్మాతలు వస్తున్నారు కాబట్టి వారు డిమాండ్ చేస్తూ కండీషన్స్ పెట్టకూడదని అంటున్నారు. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో కార్పోరేట్ కల్చర్ పెద్దగా రాలేకపోతోందని అంటున్నారు.
ఇక ఈ ప్రాజెక్టుని మైత్రి మూవిస్ వారు నిర్మించనున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మైత్రీ మూవీస్ వారు యుఎస్ బేస్ ఉన్న ఎన్నారై గ్రూప్. వారు రీసెంట్ గా ఓవర్ సీస్ లో రెండు పెద్ద చిత్రాలను పంపిణీ చేసారు. అయితే ఈ విషయమై అఫీషియల్ గా ప్రకటన ఏమీ లేదు.
మరో ప్రక్క 'ఆగడు' సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు మహేష్‌బాబు. అయితే మే నాటికి చిత్రంలో మేజర్ పోర్షన్స్ షూటింగ్ ఫినిష్ అవనున్నాయి. మే లో కేవలం కొద్ది రోజులు మాత్రమే ఆగడుకు కేటాయిస్తాడని,మిగతా డేట్స్ కొరటాల శివ వే అని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా శృతి హాసన్ ని ఫైనల్ చేసినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











