రాజమౌళి 'ఈగ' వల్లే మహేష్ 'దూకుడు' లేటు అవుతోందా?
రాజమౌళి తాజా చిత్రం ఈగ వల్లే మహేష్ చిత్రం దూకుడు ఆలస్యమవుతోందంటూ అంతటా వినిపిస్తోంది. దానికి కారణం ఈ రెండు చిత్రాలలోనూ సమంతే హీరోయిన్. సమంత దూకుడు కోసం కేటాయించిన డేట్స్ లలో పరిశ్రమ సమ్మె వచ్చింది. దాంతో ఆ డేట్స్ అన్నీ వృధా అయిపోయాయి. ఆ తర్వాత చేద్దామంటే ఆమె రాజమౌళి ఈగకు ఆ డేట్స్ కు కేటాయించింది.రాజమౌళి సినిమా కు ఎడ్జెస్ట్ మెంట్ అడుగుదామంటే తమ సినిమాలో గ్రాఫిక్స్ అధికం కాబట్టి షూటింగ్ ని వాయిదా వేసుకోవటం కష్టం అన్నారు. దాంతో సమంత, మహేష్ కాంబినేషన్ లో ఉన్న సీన్స్ ని పెండింగ్ పెట్టారు. మిగతావి చేద్దామంటే కాంబినేషన్ సీన్స్ లో ఉన్న ఆర్టిస్టులు అంతా దొరకటం లేదని తెలుస్తోంది. దీనికి తోడు మహేష్ తన రెగ్యులర్ యాడ్స్ యాక్టివిటీలో బిజీగా ఉన్నాడు. దాంతో శ్రీనువైట్ల తలపట్టుకు కూర్చున్నట్లు ఇండస్ట్రీ వార్త.


Click it and Unblock the Notifications











