వెంకితో మహేష్ ఒప్పుకోవటానికి అసలు కారణం?
వెంకటేష్, మహేష్ కాంబినేషన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే చిత్రం త్వరలో ప్రారంభం కానుందనే సంగతి తెలిసిందే. ఈ మల్టి స్టారర్ చిత్రాన్ని ఓకే చేయటానికి మహేష్ తన వైపు రీజన్ ఉందని తెలుస్తోంది. గతంలోనూ మహేష్ తో మల్టి స్టారర్ కాంబినేషన్ లో సినిమాలు చేయటానికి ఆఫర్స్ వచ్చినా ఓకే చెయ్యలేదు. అయితే వెంకటేష్ అనగానే ఓకే అనటానికి కారణం వెంకికి ఉన్న ప్యాన్స్ ఫాలంయింగే నని తెలుస్తోంది. వెంకటేష్ ప్యాన్స్ ఎప్పుడూ ఎలాంటి కాంట్రావర్శీలు, గొడవలు చెయ్యకపోవటం, మా హీరో ఇలాగే చెయ్యాలని డిమాండ్ చెయ్యకపోవటం మహేష్ ను ఈ ప్రాజెక్టు ఓకే చెయ్యటానకి కారణమని తెలుస్తోంది.
ఎందుకంటే వేరే హీరోలతో చేస్తే వారి ప్యాన్స్ మా హీరోకి తక్కువ సీన్స్ ఉన్నాయి. మహేష్ ని హీరోగా చూపెట్టారు వంటి గొడవలు చేసే ప్రమాదం ఉంది. అందుకే మహేష్ గతంలో వాటిని ఓకే చెయ్యలేదట. అయితే వెంకటేష్ కి పర్శనల్ గానూ క్లీన్ ఇమేజ్ ఉండటం, ఫ్యామిలీ హీరో కావటం, ఫ్యాన్స్ పరంగానూ తలనొప్పులు లేకపోవటమే మహేష్ ని ఈ ప్రాజెక్టు వైపు ఎక్ట్రాక్ట్ చేసింది. ఇక ఈ చిత్రంలో వెంకటేష్ అన్నయ్యగా కనిపించనున్నాడు. కుటుంబ కథా చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.శ్రీకాంత్ అడ్డాల ఈ చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నాడు.


Click it and Unblock the Notifications











