సుకుమార్ ఫ్లాఫ్ ఎఫెక్టు మణిరత్నంకి కొట్టింది

By Srikanya

హైదరాబాద్ : నాగార్జున, మహేష్‌బాబు హీరోలుగా మల్టీస్టారర్‌ సినిమాని తెరకెక్కించాలని కథ తయారు చేసుకొన్నారు మణిరత్నం. ఐశ్వర్యారాయ్‌, శ్రుతిహాసన్‌లను హీరోయిన్స్ గా ఎంచుకొన్నారు. ఇక సెట్స్‌పైకి వెళ్లడమే ఆలస్యం అనుకొంటున్న తరుణంలో మహేష్‌బాబు ఆ సినిమా నుంచి బయటికొచ్చినట్టు సమాచారం. కాల్‌షీట్లు సర్దుబాటు కాకపోవడంతో ఆయన తప్పుకొన్నట్టు మీడియాలో ప్రచారం అయ్యింది. కానీ కథ నచ్చకపోవడంతోనే మహేష్ సినిమా నుంచి తప్పుకొన్నట్టు తెలుస్తోంది.

అయితే ఆ విషయం చెప్పకుండా కాల్‌షీట్లు సర్దుబాటు కాదన్నారని వినిపిస్తోంది. ముఖ్యంగా అది హీరో ఓరియెంటెడ్ కథ కాదని,పూర్తిగా దర్శకుడు చిత్రం అని, రీసెంట్ గా నేనొక్కడినే దెబ్బ తిన్న తర్వాత మరోసారి ఇలాంటి సబ్జెక్టులో చేస్తే తన అభిమానులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారనే భయంతోనే నో చెప్పాడని చెప్పుకుంటున్నారు. దానికి తోడు మణిరత్నం ఈ మధ్య కాలంలో వరస ఫ్లాపులతో ముందుకు వెళ్తున్నారు. కడలి చిత్రం,అంతకుముందు రావణ్ చిత్రం పరాజయాలు కూడా ఈ ప్రాజెక్టు పై ప్రభావం చూపాయనటంలో సందేహం లేదు.

Why Mahesh rejected Mani Ratnam film

ఇప్పుడు నాగార్జున కూడా అలాంటి నిర్ణయమే తీసుకొన్నట్టు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం సాగుతోంది. దీంతో నాగార్జున వివరణ ఇచ్చారు. మణిరత్నం ఆ మధ్య నాకు కథ చెప్పిన మాట నిజమే. అయితే ఆయనే మళ్లీ ఫోన్‌ చేసి... 'సినిమా లేదు..' అన్నారు నాగార్జున. పాతికేళ్ల తర్వాత మణిరత్నం తెలుగులో నేరుగా ఓ సినిమా చేయాలనుకొన్నారు. కానీ ఆ చిత్రానికి అడుగడుగునా ఆటుపోట్లు ఎదురవుతున్నాయి.

మణిరత్నం తెలుగులో ఇప్పటిదాకా ఒకే ఒక్క సినిమా తీశారు. అది... 'గీతాంజలి'. సరిగ్గా పాతికేళ్ల క్రితం ఆ సినిమా విడుదలైంది. సుదీర్ఘకాలం తర్వాత మణిరత్నం తెలుగులో సినిమా చేయాలని ప్లాన్‌ చేసుకొన్నారు. కానీ ఎవరూ వూహించని రీతిలో ఆ సినిమాకి కష్టాలు ఎదురవుతున్నాయి. మరి మణిరత్నం తన కథకు హీరోలుగా ఎవరిని ఎంచుకొంటారో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X