వేలెట్టబట్టే ‘ఊ కొడతారా...’ ప్లాప్ అయ్యిందా?

By Srikanya

హైదరాబాద్: మంచు మనోజ్ తాజా చిత్రం 'ఊ కొడతారా ఉలిక్కిపడతారా'కూడా అతని వరస ప్లాపుల్లో కలిసిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో ఫిల్మ్ సర్కిల్స్ లో ఓ టాక్ మొదలైంది. ఈ చిత్రం ప్లాపుకి డైరక్టర్ కన్నా ఎక్కువ మంచు మనోజ్ ఇంటర్ ఫియర్ అవటమే కారణం అంటున్నారు. అతను ఎక్కువ తాపత్రయపడి ఈ సినిమాని ఏదో కొత్తగా చెయ్యాలని మొత్తం ప్రాజెక్టునే ఫెయిల్యూర్ చేసాడంటున్నారు.

ముఖ్యంగా సినిమా మొదట్లో వచ్చే హీరో ఫాంటసీ సాంగ్ పూర్తిగా మనోజ్ కు పుట్టిన ఆలోచనే అంటున్నారు. ఆ పాటే బాగా విమర్శలకు లోనైంది.ఎంత ఫాంటసీ కోసమైనా, ప్రియురాలు వైవిధ్యంగా ప్రేమను ప్రపోజ్ చేయమని అడిగితే, కనిపించిన వారందరిని చంపి, కర్కశంగా శవాల తలలు వేరుచేసి, వాటితో కోట కట్టడం అన్న ఆలోచన వచ్చింది మనోజ్ కే అంటున్నారు. ఆ పాట చాలా జుగుప్సగా ఉందని మొదటి రోజునుంచి విమర్శలు వినిపించాయి.

మంచి ఈజ్ వుండీ, వైవిధ్యమైన నటన ప్రదర్శించగల సత్తా వుండీ, మనోజ్ ఇలాంటి ప్రయోగాల తపనతో అవకాశాలు పాడుచేసుకుంటున్నాడనీ, అతగాడు వేళ్లెట్టకుండా వుండివుంటే, ఆ సినిమా బాగా వచ్చేదనీ అంటున్నారు. దానికి తోడు మనోజ్ మీడియా దగ్గర సైతం ఫలానా ప్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నేనే చేసాను..ఫలానా సీన్ నేను ఆలోచించిందే అని చెప్పటం కూడా ఈ విమర్శకు బలాన్నిస్తోంది.

దర్శకుడు శేఖర్ రాజా సైతం మొదటి నుంచి ఓ కొత్త జెనర్ చేస్తున్నానని,తెలుగులో ఇప్పటివరకూ రాని బ్లాక్ కామెడీ చేస్తున్నానని చెప్పుకొచ్చారు. అయితే మైండ్ లు బ్లాక్ అయ్యేరీతిలో సినిమాని తీసి ట్విస్ట్ ఇచ్చారు. అలాగే మంచు మనోజ్ మాత్రమే కాకుండా చాలా మంది హీరోలు షూటింగ్ సమయంలో,స్టోరీ సిట్టింగ్ సమయంలోనూ రకరకాల సూచనలు చేస్తారు. అయితే దర్శకుడు అనేవాడు తనకు కావాల్సింది తీసుకుని,మిగతాది వదిలేయాలి అప్పుడే మంచి అవుట్ పుట్ వస్తుంది..అలా కాకుండా పూర్తిగా హీరో క్రియేటివిటిపైనే ఆధారపడితే తన కెరీర్ కే ముప్పు వస్తుందని అంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X