మోహన్ బాబు కన్నెర్ర చేయలేదేంటి?
హైదరాబాద్ : మోహన్ బాబు మీద బయిటవారిలోనే కాక ఫిల్మ్ సర్కిల్స్ లోనూ కొన్ని నమ్మకాలు, అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన సంప్రదాయాలకు, నైతిక విలువలకు విలువ ఇస్తారని చెప్పుకుంటారు. దాంతో ఇప్పుడు ఆయన కుమారుడు సన్నిలియోన్ ని తన సినిమాలో తీసుకోవటంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. మోహన్ బాబు వద్దకు గతంలో మంచు విష్ణు...దేనికైనా రెడీ సమయంలో ఐటం సాంగ్ కోసం ఆమెను తీసుకుందామనే ప్రపోజల్ తెచ్చాడని, అయితే మోహన్ బాబు కళ్లెర్ర చేసి, ఆపాడని వార్తలు వచ్చాయి.

అయితే ఇప్పుడు మంచు మనోజ్ కరెంట్ తీగ చిత్రంలో సన్ని నటించటంతో వింతగా చెప్పుకుంటున్నారు. మోహన్ బాబుని మంచు మనోజ్ ఒప్పించాడా, మోడ్రన్ ట్రెండ్ అని సరిపెట్టుకున్నాడా అని సందేహపడుతున్నారు. ఏదైమైనా సన్నిలియోన్ పేరు చెప్పి ప్రాజెక్టుకు క్రేజ్ తెచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మంచు మనోజ్.
మంచు మనోజ్ మాట్లాడుతూ.... 'కరెంట్ తీగ' ఓల్టేజ్ పది వేల మెగావోల్ట్స్. దాని కంటే ఇంకా ఎక్కువే. ఎందుకంటే మా సినిమాలో సన్నీ లియోన్ కూడా ఉంది కదా..? ఇక ముట్టుకొంటే షాకే. నిజంగానే చాలా తమాషా కథ ఇది. పల్లెటూరు నేపథ్యంలో సాగుతుంది. నా పాత్ర తీరుతెన్నులకు సరిపోయే పేరు పెట్టారు అన్నారు.


Click it and Unblock the Notifications











