కాజల్ పై మండిపడుతున్న నాగార్జున
నాగార్జున ఇప్పుడు కాజల్ పేరు ఎత్తితే చాలు మండిపడుతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ గా వినపడుతోంది. దానికి కారణం నాగార్జున కుమారుడు నాగచైతన్యని ఆమె దడ షూటింగ్ లో ఇల్ ట్రీట్ చేసిందని తెలియటమనేనని చెప్తున్నారు. అయితే ఆ విషయం నాగచైతన్య చెప్పలేదని, బయిట మీడియాలో వచ్చిన వార్తలను బట్టి యూనిట్ ని కన్ఫర్మ్ చేసుకుని నాగార్జున కోపం తెచ్చుకున్నట్లు చెప్తున్నారు. అయితే కాజల్ సరిగ్గా ట్రీట్ చేయకపోవటానికి కారణం అప్పటికే ఆమె సీనియర్ కావటం, నాగచైతన్య జూనియర్ కావటమేనంటున్నారు.
కానీ అంత పెద్ద స్టార్ కొడుకుని, రైజింగ్ స్టార్ ని ఓ హీరోయిన్ లెక్క చేయకపోవటమనేది జరగదని, అవన్నీ కావాలని పుట్టించిన రూమర్స్ అని మరో వర్గం అంటున్నారు. కాజల్ ఇప్పుడున్న హిట్లు, బాలీవుడ్ ఆఫర్ ఎవరినీ లెక్క చేయనీయటం లేదని, నాగార్జున వద్ద కొందరు చెప్పటం జరిగిందిట. అంతేగాక ఈ మధ్యన సౌత్ ని లెక్క చేయకుండా ఆమె ఇచ్చిన స్టేట్ మెంట్స్ సైతం ఈ విషయం నమ్మేలా పురిగొల్పుతున్నట్లు చెప్తున్నారు. అయితే నాగార్జున ఇప్పుడేమీ మాట్లాడడని,సమయం వచ్చే వరకూ వేచి చూస్తాడని, అప్పుడు తప్పనిసరిగా కాజల్ దీని ప్రతిఫలం పొందాల్సి ఉంటుందని చెప్తున్నారు. ఇక దడ చిత్రం ఆగస్టు 12న విడుదల చేయటానకి సన్నాహాలు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











