1300 కోట్ల సినిమా వదులుకున్న నాగార్జున.. ఆ అవకాశాన్ని ఎందుకు వదులుకున్నారంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలున్నప్పటికీ కింగ్ అక్కినేని నాగార్జున కి ప్రత్యేకగా స్థానం ఉంది. ఇటు డివోషనల్, అటు మాస్, క్లాస్, విలన్.. ఇలా ఏ పాత్రల్లోనైనా ఇట్టే ఒదిగిపోయారు. గత 4 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నారు. ఒకవైపు భారీ ఆఫర్లు వదులుకున్నా, నాగార్జున తన ప్రతిష్టాత్మక 100వ సినిమాపై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ తరుణంలో 1300 కోట్ల కలెక్షన్ల మూవీని అందుకున్న సినిమా ఆఫర్ ను వదులుకున్నారట. ఇంతకీ ఆ మూవీ ఏంటీ? ఎందుకు ఆ భారీ ఆఫర్స్ ను వదులుకున్నారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.

కింగ్ నాగార్జున వదులుకున్న భారీ ఆఫర్ ఏంటో కాదు.. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా 'ధురంధర్'. రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన 'ధురంధర్' డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. హీరోగా రణ్‌వీర్ నటనతో పాటు, విలన్ పాత్రలో అక్షయ్ ఖన్నా ఇచ్చిన పెర్ఫార్మెన్స్‌కు విమర్శకుల నుంచి, ప్రేక్షకుల నుంచి విపరీతమైన ప్రశంసలు వచ్చాయి. కొన్ని సన్నివేశాల్లో అయితే హీరోకే సమానంగా, కొన్నిచోట్ల మించిన ఇంపాక్ట్ ఇచ్చాడని కామెంట్స్ వినిపించాయి. ఈ బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ సినిమా కు సంబంధించిన ఓ షాకింగ్ న్యూస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది.

Why Nagarjuna Rejected 1300 Cr Bollywood Blockbuster Dhurandhar

మొదట నాగార్జునకే ఆ ఆఫర్!
ఈ సినిమాలో పవర్‌ఫుల్ విలన్ పాత్ర కోసం మొదటగా దర్శకుడు ఆదిత్య థార్ మొదట నాగార్జునను సంప్రదించారట. స్టోరీ, క్యారెక్టర్ లేయర్స్ నాగ్‌కు చాలా నచ్చాయని సమాచారం. ప్రత్యేకంగా నెగెటివ్ షేడ్స్ ఉన్న ఈ పాత్రలో తనను కొత్తగా చూపించే అవకాశం ఉందని ఆయన భావించారట. అయితే అదే సమయంలో నాగార్జున ఇప్పటికే రెండు భారీ ప్రాజెక్ట్‌లకు కమిట్ అయ్యారు. ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న కూలీ, మరొకటి ధనుష్ నటిస్తున్న కుబేర. ఈ రెండు సినిమాల్లోనూ నాగార్జున నెగెటివ్ షేడ్స్ ఉన్న కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రెండు షూటింగ్స్ ఒకేసారి జరగడంతో 'ధురంధర్'కు అవసరమైన బల్క్ డేట్స్ ఇవ్వడం సాధ్యం కాలేదట. దీంతో ఎంత ఇష్టమైనా ఈ ప్రాజెక్ట్‌ను నాగ్ వదులుకోవాల్సి వచ్చిందని తెలుస్తోంది.

నాగార్జున డేట్స్ ఇవ్వలేకపోవడంతో ఆ పాత్ర అక్షయ్ ఖన్నాకు వెళ్లింది. అక్షయ్ ఖన్నా కూడా ఆ క్యారెక్టర్‌కు పూర్తి న్యాయం చేశాడని విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే.. 'ఒకవేళ నాగార్జున చేసి ఉంటే ఈ విలన్ పాత్ర మరింత పవర్‌ఫుల్‌గా ఉండేది' అని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో 'నాగ్ మిస్ అయిన బిగ్ ఛాన్స్' అంటూ పోస్టులు, కామెంట్స్ పెట్టుతున్నారు. అయితే.. ఈ టాఫిక్ పై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూమార్స్ మాత్రమే.

నాగార్జున 100వ సినిమా - 'King 100'
ఇదిలా ఉండగా, నాగార్జున కెరీర్‌లో మరో కీలక మైలురాయి కూడా సమీపిస్తోంది. ఆయన 100వ సినిమా 'King 100' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. పవర్‌ఫుల్ యాక్షన్‌తో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ కలబోసిన కథగా ఈ సినిమా ఉంటుందని నాగ్ ఇప్పటికే వెల్లడించారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో, మనం ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగార్జున స్వయంగా నిర్మిస్తున్నారు. ఇందులో ముగ్గురు కథానాయికలు ఉంటారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా టబు, అనుష్క శెట్టి, సుస్మితా భట్ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. సంగీతాన్ని రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించనున్నారు. 2026లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని ఇటీవల షిర్డీ పర్యటనలో నాగార్జున స్వయంగా స్పష్టం చేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X