నిషాకొఠారిని పెట్టుకుంటే అదే లాభం
ఒక్క హిట్టు లేకపోయినా నిషాకొఠారి ఎందుకు నిర్మాతలు ఎంకరేజ్ చేస్తున్నారు..ఇన్ని తెలుగు సినిమాల్లో నటిస్తోంది అనే డౌట్ అందరికీ వస్తోంది. ఆమె వరసగా ఒక్క మొగాడు, సామ్రాజ్యం, అడవి, హరి ఓం, అగ్గి, శివ 2006, మధ్యాహ్నం హత్య వంటి సినిమాల్లో నటిస్తూ వస్తోంది. నేపాలి లుక్ ఉండే నిషాకొఠారిని తీసుకుంటే వచ్చే లాభాలు ఏమిటంటే ఆమె నయనతార, అనూష్క, త్రిష, సదా, ఛార్మి వంటి స్టార్ హీరోయిన్స్ లా డిమాండ్స్ లిస్ట్ పెట్టదు..ఇచ్చిందేదో పుచ్చుకుంటుంది. ఇంతేకావాలి అని డిమాండ్ చేయకుండా రీజనబుల్ గా ఇంతకావాలి అని చెప్పి తీసుకుంటుంది. అందులోనూ బెట్టు చేయకుండా హీరోతో, దర్శక, నిర్మాతలతో సోషల్ గా మూవ్ అవుతుంది. అన్నిటికన్నా ముఖ్యంగా బికీనీ వేయాలన్నా, కిస్ సీన్ లలో నటించాలన్నా ఎగస్ట్రా డిమాండ్ చేయదు. అదంతా నటనలో బాగమేనని ఒప్పుకున్న రేటుకే పనికానిస్తుంది. అంతేగాక ఆమె రామ్ గోపాల్ వర్మ క్యాంప్ నుంచి రావటంతో అదో క్రేజ్. వీటికి తోడు నిషా హిందీలో కూడా ఫిమయలయిర్ ఫేస్ కావటంతో అక్కడ శాటిలైట్ రైట్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఇక్కడ ఆమెకు ఆఫర్స్ వరసగా వస్తున్నాయి. బెస్టాఫ్ లక్ నిషా.


Click it and Unblock the Notifications











