కాజల్ మీద మండిపడుతున్న ఎన్టీఆర్
జూ.ఎన్టీఆర్ సరసన కాజల్ బృందావనం చిత్రంలో చేసిన సంగతి తెలిసిందే.అయితే ఆమెను ఎన్టీఆర్ తాజా చిత్రం దమ్ములోకి కూడా తీసుకుందామనుకున్నారు.అయితే ఆమె డేట్స్ ఖాళీ లేవని తప్పుకుంది.దాంతో శృతిహాసన్ ప్లేసు లోకి త్రిష వచ్చి చేరింది.అయితే బోయపాటి శ్రీను ఆమెను ఎలాగైనా తన సినిమాలోకి తేవాలనే ఉద్దేశ్యంతో గెస్ట్ రోల్ కి అడగటం జరిగిందని ఫిల్మ్ నగర్ టాక్.అందుకోసం కేవలం రెండు రోజులు ఆమె డేట్స్ అడగటం జరిగింది.అయితే ఆమె దానికి కూడా అంగీకరించలేదు.అయితే ఆమె షాపు ఓపినింగ్స్ మాత్రం కొత్తగా ఒప్పుకున్నట్లు తెలుసింది.దాంతో తమ సినిమాకు రెండు రోజులు డేట్స్ కేటాయించలేనని చెప్పి షాపు ఓపినింగ్స్ కు వెళ్లటం ఏమిటని ఎన్టీఆర్ మండిపడుతున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్ లో చెప్పుకుంటున్నారు.ఇక కాజల్ ప్రస్తుతం మహేష్ సరసన బిజెనెస్ మ్యాన్ చిత్రంలో చేస్తోంది.పూరీజగన్నాధ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఆ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.సంక్రాంతికి ఆ చిత్రాన్ని ఎలాగైనా విడుదల చెయ్యాలని గ్యాప్ లేకుండా షూట్ చేస్తున్నారు.అది కూడా కాజల్ ఒప్పుకోకపోవటానికి కారణం అంటున్నారు.ఇక ఎన్టీఆర్ చిత్రంలోకి మరో క్రేజీ ఉన్న హీరోయిన్ ని అడుగుతున్నట్లు తెలుస్తోంది.ఇక దమ్ము చిత్రంపై ఎన్టీఆర్ అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఊసరవెల్లి చిత్రం ఊహించిన రేంజి అందుకోక చతికిలపడటంతో ఎలాగైనా ఈ చిత్రంతో పెద్ద హిట్టాలని ఎన్టీఆర్ కష్టపడుతున్నట్లు చెప్తున్నారు.డైలాగులు,డాన్స్ లు,ఫైట్స్ లో ఈ సినిమా తన దంటూ ప్రత్యేకతతో ఉంటుందని వినికిడి.


Click it and Unblock the Notifications











