జూ ఎన్టీఆర్ ‘రభస’ఎందుకు ఆగింది?
ఎందుకు ఆలస్యం అయ్యిందంటే... పెద్దగా హిట్స్ కొట్టలేకపోతున్న ఎన్టీఆర్ తన కెరీర్ ని ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు వెళ్లాలని నిర్ణయించుకోవటమే కారణమంటున్నారు. మొదట తాను ప్రస్తుతం ఒప్పుకుని చేస్తున్న రామయ్య వస్తావయ్యా చిత్రంపై పూర్తి దృష్టి పెట్టి, అది పూర్తయ్యాకే తదుపరి చిత్రం మొదలెట్టాలనుకుంటున్నాడని తెలుస్తోంది. ఇలా చేయటం వల్ల కాన్సర్టేషన్ ఒకే చిత్రంపై ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
, కందిరీగ దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న ఈ రభస చిత్రంలో ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్‌గా నటించనుంది. కమర్షియల్ మాస్ ఎంటర్ టైనర్‌గా రూపొందనున్న సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. ఆ మధ్య 'కందిరీగ' సినిమాకు సంతోష్ శ్రీనివాస్ సీక్వెల్ తీయబోతున్నాడని వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత వారు తమ ప్రాజెక్ట్ నుంచి హీరో రామ్ ను తప్పించి, ఎన్టీఆర్ వైపు మొగ్గు చూపారు.
'కందీరీగ-2′ ను రద్దు చేసుకుని, అందుకోసం రూపొందించుకున్న స్క్రిప్ట్ ను 'రభస'గా మార్చుకుని ఎన్టీఆర్ ను సంప్రదించారట దర్శక నిర్మాతలు. అయితే ఈ సినిమాపై అఫీషియల్ ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా...ప్రస్తుతం జూ ఎన్టీఆర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో 'రామయ్యా వస్తావయ్యా' చిత్రంలో బిజీగా గడుపుతున్నారు. ఈ చిత్రంలో జూ ఎన్టీఆర్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తోంది. శృతి హాసన్ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టెనర్ గా రూపొందుతున్న ఈ మూవీలో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ పాత్రను పోషిస్తున్నారు.


Click it and Unblock the Notifications












