అదే పార్వతి మిల్టన్ భయమా?
మీడియాకు మొహం చాటేస్తూ పార్వతి మిల్టన్ తిరుగుతోంది. జల్సా చిత్రం తర్వాత మరే చిత్రం కమిట్ కాని ఈమె ఈ మధ్య కొద్ది మంది నిర్మాతలు పర్శనల్ గా కలిసిందని, ఒక చిత్రం కమిట్ అయ్యిందని విపడింది. అయితే ఆమె ఆ విషయం మీడియాకు చెప్పటానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే మీడియా ముందుకు ఆమె రాగానే వరుడు చిత్రంలో మహేష్ పాత్ర ఎలా మిస్సయ్యావు అని అడుగుతారని ఆమె భయం అంటున్నారు. అంతేగాక త్రివిక్రమ్ కీ తనకీ చెడిన విషయాన్ని సైతం ప్రస్ధావిస్తారని అందుకే ఆమెకు మెహం చెల్లటం లేదని అంటున్నారు. పెద్ద సినిమా అని అన్ని చోట్లా పబ్లిసిటీ చేసుకుని చివర నిముషంలో ఆమెను తప్పించటం తీరని దెబ్బగా భావిస్తోందని అంటున్నారు. అయితే సినీ పరిశ్రమలో ఇవన్నీ కామన్ అనీ పడిలేచిన వాళ్ళే ఇక్కడ సెటిల్ అవుతారని సన్నిహితులు సలహాలిస్తున్నారు. ఏదైమైనా మళ్ళీ పార్వతి కెమెరా ముందుకు వచ్చి బిజీ అయితే ఇవన్నీ మర్చిపోతారన్నది నిజం.


Click it and Unblock the Notifications











