'గబ్బర్ సింగ్- 2' కి డైరక్టర్ మార్పుకు అసలు కారణం
హైదరాబాద్ : పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా భావించి రూపొందింస్తున్న గబ్బర్ సింగ్ 2 కు దర్శకుడు ని మార్చటం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకు మార్చారనేది ఎవరికీ అర్దం కాలేదు. ఎవరికి తోచిన కారణం వారు చెప్పుకున్నారు. అయితే తాజాగా ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతున్న దాన్ని బట్టి దర్శకుడు సంపత్ నందిని మార్చటానికి వేలీడ్ రీజన్ ఉందంటున్నారు.
అత్తారింటికి దారేది సమయంలోనే పవన్ కళ్యాణ్ ...ఈ గబ్బర్ సింగ్ 2 కు కథ ని అనుకోవటం జరిగింది. త్రివిక్రమ్ ..స్పెయిన్ లో షూటింగ్ జరుగుతున్నప్పుడు సంపత్ నంది ఆ పాయింట్ ని డవలప్ చేసి నేరేట్ చేసాడట. అయితే అది పవన్ కి అసలు నచ్చలేదుట. ఆ తర్వాత గోవాలో షూటింగ్ జరిగేటప్పుడు, అత్తారింటికి దారేది రిలీజ్ ముందు గ్యాప్ లోనూ స్టోరీని సంపత్ తో కలిసి డిస్కస్ చేసాడట. అయితే పవన్ ఎప్పుడూ సంతృప్తి చెందలేదట. తను అనుకున్న విధంగా నేరేషన్ రాలేదని క్లియర్ గా చెప్పాడట.
అయితే ఈ లోగా మీడియాలో గబ్బర్ సింగ్ 2 ఆగిపోయినట్లే అని వార్తలు వచ్చాయి. దాంతో పవన్ అర్జెంటుగా ఈ చిత్రం ఓపినింగ్ పెట్టారు. అప్పటికీ స్క్రిప్టు ఓ షేప్ కు రాలేదు. తర్వాత ఇక టైమ్ వేస్ట్ అవుతోందని భావించిన పవన్ వెంటనే ..గోపాల గోపాల చిత్రం కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ షూటింగ్ లో ఉంటూనే ఈ స్క్రిప్టుపై కసరత్తు చేసేవారు. ఇలా ఎంత జరిగినా పవన్ అనుకున్నట్లు స్క్రిప్టు రాలేదు.

ఈ లోగా పవన్ దర్శకుడు బాబీని గోపాల గోపాల కెమెరామెన్ జయంత్ విన్సెంట్ పరిచయం చేయటం జరిగింది. అతను ఈ గబ్బర్ సింగ్ 2 కోసం చెప్పిన వెర్షన్ బాగా నచ్చటంతో ఇమ్మీడియట్ గా అతన్నే దర్శకుడుగా ఫైనలైజ్ చేసారు పవన్. ఎట్టిపరిస్ధితుల్లోనూ గబ్బర్ సింగ్ కన్నా పెద్ద హిట్ గబ్బర్ సింగ్ 2 తో కొట్టాలని పవన్ భావిస్తున్నారు. అందుకే దర్శకుడుని మార్చటం జరిగిందని, కేవలం క్రియేటివ్ డిఫెరెన్సెస్ లు తప్ప మరొకటి కాదని చెప్తున్నారు.
'నాక్కొంచెం తిక్కుంది...' అంటూ గబ్బర్ సింగ్‌గా పవన్ కల్యాణ్ చేసిన హంగామా ప్రేక్షకుల్ని ఆకట్టుకొంది. ఇప్పుడు 'గబ్బర్ సింగ్'కి రెండో భాగం రూపుదిద్దుకోబోతోంది. సంపత్ నంది దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపు 70 కోట్లు అని తెలుస్తోంది. ఈరోస్ వారు ఈ చిత్రం సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఈ బడ్జెట్ ని పెట్టడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.
త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. శరత్ మరార్ నిర్మాత. గబ్బర్ సింగ్-2 చిత్రాన్ని పవన్ స్నేహితుడు శరత్ మరార్ నిర్మిస్తున్నారు. తొలిసారి సినీ నిర్మాణ రంగంలోకి అడుగు పెడుతున్న తన స్నేహితుడికి మేలు జరుగాలనే ఉద్దేశ్యంతోనే ఈ సీక్వెల్ నిర్ణయం పవన్ ఈ నిర్ణయం తీసుకున్నారనే వాదన కూడా ఉంది.


Click it and Unblock the Notifications











