పవన్ కళ్యాణ్ హఠాత్తుగా పి.ఎ ను ఎందుకు మార్చారు?
పవన్ కళ్యాణ్ కీ, బడే రవి మధ్యన పర్శనల్ అసెస్టెంట్ ,హీరో అన్న రిలేషన్ ని మించి మంచి స్నేహం ఉందని చెప్తారు. అలాగే బడే రవి చాలా కాలంగా పవన్ ఫ్యాన్స్ కీ, పవన్ కి మధ్య వారిధిలా ఉండేవారు. అయితే తాజాగా వచ్చిన కొన్ని విభేధాలతో బడే రవిని పి.ఎ పోస్ట్ నుంచి తప్పించారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. పవన్ ప్రాణమిచ్చే ఫ్యాన్స్ కొందరు ఇచ్చిన కంప్లైంట్ తో ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్తున్నారు. పవన్ కీ, ఫ్యాన్స్ కి మధ్య కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందని, అది పోవాలంటే మార్గం రవిని మార్చటమేనని పవన్ నిర్ణయించుకున్నాడని చెప్తున్నారు.ఇక పవన్ కళ్యాణ్ తన కొత్త పి ఎ గా హనీఫ్ అనే అతన్ని తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా దీనిని ధృవీకరించలేదు. ఇక బడే రవి ప్రస్తుతం తీన్ మార్ చిత్రానికి కో ప్రొడ్యూసర్ గా వ్యవరిస్తున్నారు. బాలీవుడ్ హిట్ లవ్ ఆజ్ కల్ కి రీమేక్ గా రూపొందుతున్న తీన్ మార్ చిత్రానకి త్రివిక్రమ్ రచన చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జయంత్ పరాంన్జీ దర్శకత్వంలో పరమేశ్వర ఆర్ట్ పతాకంపై హాస్య నటుడు గణేష్ నిర్మిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











