twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    "మేము సైతం" కి పవన్ ఎందుకు రాలేదు?

    By Srikanya
    |

    హైదరాబాద్: గత రెండు రోజులుగా తెలుగు సిని పరిశ్రమ అంతా ఒక త్రాటి మీదకొచ్చి గ్రాండ్ గా చేసిన వైజాగ్ పోగ్రాం...మేము సైతం గురించే అంతటా చర్చ. ముఖ్యంగా ఈ పోగ్రాంలో పవన్ కళ్యాణ్ పాల్గొనకపోవటంతో అంతా ఆశ్చర్యపోయారు. ఆయనకు వైజాగ్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండటమే కాకుండా...సామాజిక కార్యక్రమాల్లో ముందు నుంచి స్వచ్చందంగా పాల్గొంటూ వస్తున్నారు. ఈ నేపధ్యంలో ఈ పోగ్రాంలో పాల్గనకపోవటంతో అందరూ అసలు ఎందుకు పాల్గొనలేదంటూ కారణాలు వెతకటం మొదలెట్టారు.

    అయితే పవన్ కళ్యాణ్ కు జ్వరం వచ్చి ఈ పోగ్రాంలో పాల్గొనలేదని ఓ వర్గం అంటోంది. అయితే ఎన్టీఆర్ హై ఫీవర్ లోనూ ఈ పోగ్రాం కోసం వచ్చారు. పోనీ తాను రాలేకపోతున్నట్లు ఓ వీడియో తీసి పంపినా బాగుండేది అంటున్నారు. చివరకు మహేష్ లాగ రికార్డెడ్ పోగ్రాం షూట్ చేయించి పంపినా ఆయన భాధ్యతగా ఉన్నట్లు అందరికీ అర్దమై...ఇప్పుడు అనవసరమైన టాపిక్స్ కు దారి తీయకుండా ఉండేదని చెప్పుకుంటున్నారు. మరో ప్రక్క తన అన్నతో స్టేజి పంచుకోవటం ఇష్టం లేక రాలేదని సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో ప్రచారం జరుగుతోంది.

    పవన్ తాజా చిత్రం ...గోపాల గోపాల విషయానికి వస్తే...

    Why Pawan Kalyan gave Memu Saitham a miss?

    నిజం వేరు.. నమ్మకం వేరు. రెండింటి మధ్య స్పష్టమైన గీత ఉంది. భక్తి ఆ గీతను చెరిపేస్తుంది. నాస్తికులు మాత్రం అదే గీతను భూతద్దంలో పెట్టి చూపిస్తుంటారు. మనం నమ్మేవన్నీ నిజాలు కావు, దేవుడిపై మనకున్నది నమ్మకం కాదు, భయం అని మరో వాదన లేవదీశాడొకాయన. నలుగురి మధ్యో, నాలుగు గోడల లోపలో ఈ ప్రశ్న లేవనెత్తలేదు. ఏకంగా న్యాయస్థానంలోనే చర్చకు తెరలేపాడు. ఆ తరవాత ఏమైందో? ఈ ప్రశ్నలకు జవాబు ఇచ్చిందెవరో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు కిషోర్‌ పార్థసాని (డాలీ). ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'గోపాల గోపాల'. సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. ''బాలీవుడ్‌ చిత్రం 'ఓ మై గాడ్‌'కి రీమేక్‌ ఇది. వెంకటేష్‌, పవన్‌ పాత్రలు మనసుకు హత్తుకొంటాయ''ని యూనిట్ చెబుతోంది.

    సృష్టి లయలకు కారణం నేనే. సమస్త లోకాన్నీ నేనే నడిపిస్తున్నా.. అని కృష్ణుడు గీతోపదేశం చేశాడు కదా.. అయితే నా కష్టాలకూ ఆయనే బాధ్యుడు..'' అంటూ లాజిక్‌ తీశాడొకాయన. అక్కడితో ఆగలేదు. కోర్టు మెట్లెక్కాడు. న్యాయశాస్త్రంలోనూ ఈ ప్రశ్నకు జవాబు దొరకలేదు. చివరికి ఆ కృష్ణుడే దిగి సంజాయిషీ ఇవ్వాల్సి వచ్చింది. ఈ కథెలా నడిచిందో తెలియాలంటే 'గోపాల గోపాల' చూడాల్సిందే. పవన్ కళ్యాణ్ పాత్ర చిత్రంలో 45 నిముషాలు మాత్రమే ఉంటుందని అన్నారు.

    చిత్రం కథ విషయానికి వస్తే..

    దేవుడంటే నమ్మకం లేని ఓ వ్యక్తి దుకాణం నడుపుతంటాడు. అందులో అమ్మేవేమిటో తెలుసా? దేవుడి బొమ్మలే! మాట్లాడితే దేవుడి అస్థిత్వాన్ని ప్రశ్నిస్తుంటాడు. అలాంటిది అతడి దుకాణం భూకంపం దాటికి నేలకూలియింది. అప్పుడు అతడేం చేశాడు? అనే అంశం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం 'గోపాల గోపాల'. వెంకటేష్‌, పవన్‌ కల్యాణ్‌ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. వెంకటేష్‌ సరసన శ్రియ నటిస్తోంది.

    బిజినెస్ విషయానికి వస్తే...

    పవన్ కళ్యాణ్ కి నైజాం ఏరియాలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే అక్కడ ఆయన సినిమాలు రికార్డులు బ్రద్దలు కొడుతూంటాయి. గబ్బర్ సింగ్ 17 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది దాదాపు 24 కోట్లు షేర్ వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. దాంతో ఇప్పుడు పవన్ తాజా చిత్రం 'గోపాల గోపాల' కి ఆ ఏరియాలో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

    అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం 'గోపాల గోపాల' నైజాం రైట్స్ ని 14 కోట్లకు అమ్ముడైంది. ప్రశాంత్ ఫిల్మ్ వారు ఈ ఏరియా పంపిణీ హక్కులు పొందారు. ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం థియోటర్ వరకూ...55 కోట్లు చేసిందని ట్రేడ్ సర్కిల్స్ లో వినపడుతోంది. నిర్మాత సురేష్ బాబు, శరద్ మరారా లు దాదాపు 20 కోట్లు వరకూ టేబుల్ ప్రాఫెట్ ని లబ్ది పొందుతున్నారని టాక్. ముఖ్యంగా పవన్ గత చిత్రం అత్తారింటికి దారేది కన్నా ప్రొడక్షన్ కాస్ట్ చాలా తక్కువ కావటం కలిసి వచ్చే అంశం.

    అలాగే...పవన్‌ కోసం ఓ బైక్‌ను అమెరికా నుంచి దిగుమతి చేశారని తెలిసింది. అన్ని పనులు పూర్తిచేసి ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వినిపిస్తుంది. ఈ చిత్రానికి అనూప్‌ రూబెన్స్‌ సంగీతం. మిగతా ముఖ్య పాత్రల్లో.. మిధున్‌చక్రవర్తి, పోసాని, కృష్ణుడు, రఘుబాబు, రంగనాధ్‌, రాళ్ళపల్లి, వెన్నెల కిషోర్‌, పృథ్వి, దీక్షాపంత్‌, నర్రా శీను తదితరులు నటిస్తున్నారు.

    English summary
    Pawan's absence at the 12-hour telethon became talk of the town and different reasons are being proffered.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X