For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  షాకింగ్ : ఇక పవన్ కళ్యాణ్ 'పవర్ స్టార్' కాదా? ఎందుకలా? అదే కారణమా? అసలేమైంది?

  |

  పవన్ కళ్యాణ్ అనే పేరు తెలియని తెలుగువాడు ఉండడు, అలాగే పవర్ స్టార్ అనే పదం కూడా పవన్ కళ్యాణ్ కోసమే సృష్టించారు అన్నట్లుగా ఉంటుంది. అలాంటి పవన్ కళ్యాణ్ కోసం ఇప్పుడు పవర్ స్టార్ అనే పేరు పక్కన పెట్టేస్తున్నారా? ఎందుకు అలా చేస్తున్నారు? పవన్ పేరు ముందు పవర్ స్టార్ అనే పదం లేకుండానే ఎందుకు దర్శక నిర్మాతలు పబ్లిసిటీ చేస్తున్నారు ? అనే వివరాల్లోకి వెళితే

  ఎన్నికల కోసమే రణరంగంలోకి

  ఎన్నికల కోసమే రణరంగంలోకి

  2018లో చివరిగా అజ్ఞాతవాసి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ ఆ సినిమా ఊహించిన కొంత మేర సక్సెస్ కాకపోవడంతో ఇక సినిమాలు చేయడం ఆపేస్తున్నా అని చెబుతూ తన పూర్తి సమయం రాజకీయాలకే కేటాయించబోతున్నా అని ప్రకటించారు. ఆయన ప్రకటన చేసినట్లుగానే సినిమాలు నిలిపి వేసి పూర్తిగా 2019 ఎన్నికల కోసమే రణరంగంలోకి గారు.. అనూహ్యంగా ఆయన భీమవరం, గాజువాక అనే రెండు స్థానాల నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు.

   పవన్ కళ్యాణ్ రాజకీయం

  పవన్ కళ్యాణ్ రాజకీయం

  సీఎం అవ్వాలని ఆశ లేదు కానీ ముందు నుంచి ప్రశ్నిస్తాను అనే కోవలోనే పవన్ కళ్యాణ్ రాజకీయం నడుస్తూ వచ్చింది. అందులో భాగంగానే ఆయన కొన్ని సీట్లు అయినా తెచ్చుకుంటారని భావించారు. కొన్ని సీట్లు సంగతి దేవుడెరుగు పవన్ కళ్యాణ్ నిలబడే స్థానాల నుంచి కూడా గెలవడం కష్టమైంది. దీంతో ఆయన రాజకీయంగా ఆక్టివ్ అవ్వకపోవచ్చు అని ఊహాగానాలు వెలువడినా ఓడిన వెంటనే ప్రజల ముందుకు వచ్చిన పవన్ తన ఓడిన గెలిచిన ప్రజల పక్షాన నిలబడే ఉంటానని అన్నారు. అన్నట్టుగానే ఆయన ప్రజల పక్షాన నిలబడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు.

  రీ ఎంట్రీ

  రీ ఎంట్రీ

  ఒకవేళ జగన్ పాలన బాగుంటే వెళ్ళి సినిమాలు చేసుకుంటానని ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అందుకు తగినట్లుగానే ఆయన సినిమాలు చేస్తూ ఉండడంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. కానీ తనకు వేరే మార్గాలు లేకపోవడంతో పార్టీని నడపాలని తాను పిల్లలను పోషించాలి అన్న సినిమాలు తక్కువ కాబట్టి సినిమాలు చేసుకుంటాం అని చెప్పుకొచ్చారు. ఆయన అన్నట్లుగానే వకీల్ సాబ్ అనే సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో శృతిహాసన్ హీరోయిన్ గా నటించిన సినిమాలో పవన్ కళ్యాణ్ నటించి ప్రేక్షకులను మెప్పించారు.

   వరుస సినిమాలు

  వరుస సినిమాలు

  నిజానికి ఆ సినిమా చేస్తున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ వరుస సినిమాలు ఒప్పుకున్నారు. ఆ సినిమాలలో క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతున్న హరిహర వీరమల్లు, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న 28వ సినిమా, అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మరో సినిమా కూడా ఆయన ఒప్పుకున్నారు. దర్శకుడు ఎవరో తెలియదు కానీ బండ్ల గణేష్ నిర్మాణంలో కూడా ఆయన ఒక సినిమా చేస్తానని మాట ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరుకు పవర్ స్టార్ అనే పదాన్ని దూరం చేసే ప్రయత్నం జరుగుతోంది.

  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున

  పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున


  సరిగ్గా రెండు రోజుల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు జరిగింది. ఆ రోజు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువలా రావడమే కాక ఆయన నటిస్తున్న దాదాపు అన్ని సినిమాలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేశారు. ఈ పోస్టర్లు విడుదల చేసే సమయంలో ఎక్కడ పవర్ స్టార్ అనే పేరు కనిపించకపోవడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అసలు పవర్ స్టార్ అనే పేరు ఎందుకు కనిపించలేదు? దర్శకనిర్మాతలు కావాలనే ఆ పేరును పక్కన పెట్టారా ? లేక పొరపాటున జరిగిందా ? అనే చర్చ అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతోంది.. అయితే పొరపాటున జరిగితే ఒక సినిమా పోస్టర్ లేదా 2 సినిమాల పోస్టర్ లో అలా జరుగుతుంది కానీ నాలుగు సినిమాల నుంచి అప్డేట్ వస్తే ఒక్క సినిమా అప్డేట్ లో కూడా ఆయనను పవర్ స్టార్ అని సంబోధించడం పోవడమే ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.

  ఎన్నడూ ఒప్పుకోలేదు

  ఎన్నడూ ఒప్పుకోలేదు


  పవన్ కళ్యాణ్ తన 'స్టార్' ట్యాగ్‌ని ఎన్నడూ ఒప్పుకోలేదు అయితే ఇటీవల జరుగుతున్న సంఘటనలను పరిశీలిస్తే, ఆయన తన పేరు నుండి ఆ 'పవర్‌స్టార్'ను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, అతని రాబోయే చిత్రాల నిర్మాతలు కొన్ని పోస్టర్‌లను విడుదల చేశారు మరియు వాటిలో ఒక్క పోస్టర్ లో కూడా పవర్‌స్టార్ గురించి కూడా ప్రస్తావించలేదు. ఒక్క కొత్త పోస్టర్‌లో ఈ విధంగా రాయకపోవడం యాదృచ్చికం కాదు, కానీ రాజకీయ నాయకుడిగా ఉన్న ఆయబ సినిమా పేరు ట్యాగ్‌ల నుండి తనను దూరం చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నం అని అంటున్నారు.

  Ram Charan Biography: Ram Charan is one of the highest paid actors of Tollywood
  'జనసేనాని'గా ముద్ర

  'జనసేనాని'గా ముద్ర

  లోతుగా పరిశీలిస్తే, థమన్ వంటి కొంత మంది టెక్నీషియన్‌ల ట్వీట్‌లలో పవన్ కళ్యాణ్ పేరుకు 'లీడర్' అనే పదం జోడించబడింది. పవన్ కళ్యాణ్ టీమ్ ఈ విషయంలో ముందుండి నడిపించిందని అంటున్నారు. ఆయనకు రాజకీయాలు మరియు సినిమాలపై సమానంగా ఆసక్తి ఉందని సందేశం పంపే ప్రయత్నం కావచ్చని అంటున్నారు. అందుకే 'పవర్‌స్టార్' అనే బదులు 'జనసేనాని'గా ముద్ర వేసే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు.

  English summary
  On Power Star Pawan Kalyan's birthday, all the updates from his upcoming films came. but it came as a surprise that Pawan Kalyan's Power Star name did not appear in the posters of these four films.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X